AP Weather Report: ఏపీలో వారం రోజుల పాటు జాగ్రత్త, ఎండలు మండిపోతాయంటున్న వాతావరణ శాఖ, బంగాళాఖాతాన్ని తాకకుండా నేరుగా అరేబియన్ సముద్రం వైపు వెళ్లిపోతున్న గాలులే కారణమంటున్న నిపుణులు
ఇప్పటికే రాష్ట్రంలో ఎండల మండుతున్నాయి. వర్షాలు కురవాల్సిన సమయంలొ సూర్యుడు భగభగమంటున్నాడు. నైరుతి రుతు పవనాల (Southwest monsoon) ప్రభావంతో వీచే గాలులు బలహీనపడటంతో నైరుతి, పశ్చిమ దిశగా వీయాల్సిన గాలుల్లో తేమ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్టు వాతావరణ శాఖ చెబుతోంది.
Amaravati, August 7: ఏపీలో రానున్న 10 రోజులు సూర్యుడు నిప్పులు కురిపించనున్నాడు. ఇప్పటికే రాష్ట్రంలో ఎండల మండుతున్నాయి. వర్షాలు కురవాల్సిన సమయంలొ సూర్యుడు భగభగమంటున్నాడు. నైరుతి రుతు పవనాల (Southwest monsoon) ప్రభావంతో వీచే గాలులు బలహీనపడటంతో నైరుతి, పశ్చిమ దిశగా వీయాల్సిన గాలుల్లో తేమ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్టు వాతావరణ శాఖ చెబుతోంది.
సాధారణంగా ఈ సీజన్‌లో పాకిస్తాన్ వైపు నుంచి వీచే గాలులు బంగాళాఖాతం (Bay of Bengal) మీదుగా అరేబియన్ సముద్రం వైపు వెళ్లాలి. ఈ గాలుల్లో తేమ ఎక్కువగా ఉన్నప్పుడే మేఘాలు ఏర్ప డి వర్షాలు కురుస్తాయి. అయితే ప్రస్తుతం ఈ గాలులు చాలావరకు బంగాళాఖాతాన్ని తాకకుండా నేరుగా అరేబియన్ సముద్రం వైపు వెళ్లిపోతున్నాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఏర్పడ్డాయి. మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీ ర్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవడానికి ఈ గాలులే కారణమని వాతావరణ శాఖ చెబుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 36 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ లేకపోవడం వల్ల ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటోంది. కొద్దిగా వీస్తున్న గాలుల ప్రభావంతో అక్కడక్కడా స్వల్ప స్థాయిలో వర్షాలు పడుతున్నా.. మొత్తంగా రాష్ట్రమంతా వేడి వాతావరణం ఉంటోంది. ఈ పరిస్థితి మరో వారం రోజులపాటు (High Temperature in next One Week) కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 13వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత పరిస్థితి కొంత మారవచ్చని అంచనా వేస్తోంది.