AP Covid Report: విషమంగా టీడీపీ నేత సబ్బం హరి ఆరోగ్యం, ఏపీలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 69 మంది కరోనాతో మృత్యువాత, రాష్ట్రంలో 12,634 కొత్త కోవిడ్ కేసులు, తమిళనాడుకి వెళ్లాలంటే ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసిన ఏపీ ప్రభుత్వం
గత 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 12 మంది కరోనాకు బలయ్యారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాల సంఖ్యలో పెరుగుదల నమోదైంది. ఈ క్రమంలో ఇప్పటివరకు కరోనాతో కన్నుమూసిన వారి సంఖ్య 7,685కి పెరిగింది.గడచిన 24 గంటల్లో ఏపీలో (Andhra Pradesh) 62,885 కరోనా పరీక్షలు నిర్వహించగా 12,634 మందికి పాజిటివ్ (12,634 new cases) అని నిర్ధారణ అయింది.
Amaravati, April 26: ఏపీలో ఒక్కరోజులోనే 69 మంది కరోనాతో మృత్యువాత (highest daily toll of 69 this year) పడ్గారు. గత 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 12 మంది కరోనాకు బలయ్యారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాల సంఖ్యలో పెరుగుదల నమోదైంది. ఈ క్రమంలో ఇప్పటివరకు కరోనాతో కన్నుమూసిన వారి సంఖ్య 7,685కి పెరిగింది.గడచిన 24 గంటల్లో ఏపీలో (Andhra Pradesh) 62,885 కరోనా పరీక్షలు నిర్వహించగా 12,634 మందికి పాజిటివ్ (12,634 new cases) అని నిర్ధారణ అయింది.
శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 1,680 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 1628, గుంటూరు జిల్లాలో 1576, నెల్లూరు జిల్లాలో 1258, కర్నూలు జిల్లాలో 1158, అనంతపురం జిల్లాలో 1095 కరోనా కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 4,304 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 10,33,560 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 9,36,143 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 89,732కి పెరిగింది.
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కరోనా బారినపడ్డారు. మూడు రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణైంది. వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉందని ఆస్పత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి. పది రోజుల క్రితం ఆయనకు కోవిడ్ సోకడంతో వైద్యుల సూచనతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే గత మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి మరో 4 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు ఆదివారం రాష్ట్రానికి చేరుకున్నాయి. న్యూఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో ఈ డోసులను ఇక్కడికి తరలించారు. అనంతరం విమానాశ్రయం నుంచి కంటైనర్లలో గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తీసుకువచ్చి భద్రపరిచారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ వేసేందుకు 2 రోజుల వ్యవధిలో 5 లక్షల కోవిషీల్డ్ డోసులను దిగుమతి చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక్కడి నుంచి 13 జిల్లాలకు తరలించినట్లు శీతలీకరణ అధికారి దేవానందం తెలిపారు.
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో తమిళనాడుకి ప్రయాణించేవారు ఈ–పాస్‌ను తప్పనిసరిగా పొందాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (ఏపీపీటీడీ) ఆర్‌ఎం పీవీ శేషయ్య ఆదివారం తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం శనివారం రాత్రి నుంచి ఆంక్షలను కఠినతరం చేసిందని పేర్కొన్నారు.
ఇకపై ఏపీ, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి తమిళనాడుకి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఈ పాస్ పొందాలని ఆదేశించినట్లు వివరించారు. ప్రయాణికులు https.eregister.tnega.org వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకుంటే వారి ఫోన్ నంబర్‌కు ఈ పాస్ మెసేజ్ వస్తుందన్నారు. నెల్లూరు రీజియన్ నుంచి చెన్నై వెళ్లేవారు వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.