Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఈఎంఐ పద్ధతిలో ఈ–స్కూటర్లను అందించనున్న జగన్ సర్కారు

ఏపీ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం (YS Jagan Govt ) తీపి కబురు అందిస్తోంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌(ఈ–స్కూటర్‌)లను వాయిదాల పద్ధతిలో (e-bikes to govt employees on EMI) అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది.

AP Government logo (Photo-Wikimedia Commons)

Amaravati, Sep 15: ఏపీ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం (YS Jagan Govt ) తీపి కబురు అందిస్తోంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌(ఈ–స్కూటర్‌)లను వాయిదాల పద్ధతిలో (e-bikes to govt employees on EMI) అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రతి రోజూ కార్యాలయానికి వెళ్లి రావడం, ఇతర పనుల మీద ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న వారిలో ఉద్యోగులు ఎక్కువ శాతం ఉంటున్నారు.అదీ కాకుండా పెరుగుతున్న పెట్రోలు ధరలతో ఈ సామాన్య, మధ్య తరగతి వేతన జీవులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది.

వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు వాహన కాలుష్యాన్ని అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ–స్కూటర్లు అందించే దిశగా అడుగులు వేస్తోంది. తొలుత ప్రభుత్వ ఉద్యోగులకు వీటిని అందించనుంది. కొనుగోలు చేసిన ఈ–స్కూటర్లకు ఒకేసారి కాకుండా 60 నెలల పాటు వాయిదాల పద్ధతిలో (ఈఎంఐ) డబ్బులు చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

గోదావరికి పోటెత్తుతున్న వరద, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం, ముంపు వాకిట్లో ఏజెన్సీ ప్రాంతాలు

గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలో పని చేసే ఉద్యోగులు సైతం ఈ–స్కూటర్లు కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఆ సంస్థ నిర్వాహకుడు (మేనేజర్, సీఈఓ తదితర) సదరు ఉద్యోగి నుంచి ప్రతి నెలా ఈఎంఐ చెల్లించేందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఇందుకు అవసరమైన ప్రణాళికలను ఆంధ్రప్రదేశ్‌ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్‌) అధికారులు సిద్ధం చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Chandrababu Davos Tour Highlights: దావోస్‌లో సీఎం చంద్రబాబు పర్యటన హైలెట్స్ ఇవిగో, బిల్ గేట్స్‌తో పాటు పలువురు ప్రముఖులతో భేటీ, ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా టూర్

Raichur Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మంత్రాలయ విద్యార్థులు మృతి, సంతాపం తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ

Hyderabad: జామై ఉస్మానియా రైల్వేస్టేషన్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, ట్రాక్ మీద రెండు ముక్కలుగా శరీరీం, మృతురాలిని భార్గవిగా గుర్తించిన పోలీసులు

Andhra Pradesh: వీడియో ఇదిగో, కీలక సమావేశాన్ని వదిలేసి ఆన్‌లైన్‌‌లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన డీఆర్ఓ, ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు

Share Now