Janasena: ఏపీలో వైసీపీ - టీడీపీలకు జనసేన పవన్ కళ్యాణే ప్రత్యామ్నాయమా?, వైసీపీని వీడుతున్న నేతలకు ఫస్ట్ ఛాయిస్ పవనేనా?, పెరుగుతున్న పవన్ గ్రాఫ్ ఏం చెబుతోంది!
వాస్తవానికి ఏపీలో కూటమి, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చాక పవన్ కు ఇంపార్టెన్స్ మరింతగా పెరిగింది. ఈ ఎన్నికలతో ఎమ్మెల్యే కావాలన్న పవన్ కోరిక తీరడంతో పాటు రాజకీయంగాను పట్టు సాధించారు పవన్. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి...పవన్‌పై ప్రశంసలు గుప్పించడంతో పవన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.
Vij, July 27: ఏపీ రాజకీయాలు టీడీపీ - వైసీపీ మధ్య హాట్ హాట్‌గా సాగుతున్నాయి. వైసీపీ నేతలపై దాడులు, హత్యా రాజకీయాలపై హస్తిన వేదికగా జగన్ స్వరం వినిపిస్తే, సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా జగన్ వైఖరిని ఎండగట్టారు. ఇక జగన్ రాజకీయాలకు పనికి రాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఇక ఇదే అసెంబ్లీ వేదికగా పలు సందర్భాల్లో పవన్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ఇప్పుడు ఇదే ఏపీలో వైసీపీ - టీడీపీ పార్టీలకు జనసేన ప్రత్యామ్నాయంగా ఎదిగే స్కోప్ వచ్చింది. వాస్తవానికి ఏపీలో కూటమి, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చాక పవన్ కు ఇంపార్టెన్స్ మరింతగా పెరిగింది. ఈ ఎన్నికలతో ఎమ్మెల్యే కావాలన్న పవన్ కోరిక తీరడంతో పాటు రాజకీయంగాను పట్టు సాధించారు పవన్. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి...పవన్‌పై ప్రశంసలు గుప్పించడంతో పవన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. డిప్యూటీ సీఎంగానూ పవన్ తనదైన మార్క్ పాలనతో దూసుకుపోతున్నారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పాలన ఉండేలా సూచనలు చేస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధిగా తన దృష్టికి వచ్చిన విషయాలను వెంటవెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు పవన్.
ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలకు గాను 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి రెండింటిలోనూ విజయం సాధించారు. ఇక దీనిని అవకాశంగా వాడుకుని టీడీపీ ,వైసీపీలకు తానే ప్రత్యామ్నాయం అనే సంకేతాలను ఇస్తున్నారు పవన్. అందుకే వైసీపీని వీడుతున్న నేతలకు ఫస్ట్ ఛాయిస్ జనసేనే అవుతోంది. టీడీపీని కాదని జనసేనలో చేరేందుకే వైసీపీ నేతలు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
ఇటీవలె వైసీపీకి రాజీనామా చేసిన కిలారి రోశయ్య… జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇందుకోసం తన వియ్యంకుడైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ద్వారా జనసేన అధినేతతో చర్చలకు సిద్ధమవుతున్నారు.ఇక చాలా మంది వైసీపీ నేతలు సైతం జనసేనలో చేరేందుకు రెడీ అవుతుండటం, జనసేన క్రీయాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాలను అనూహ్య స్పందన వస్తుండటంతో పవన్ ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి. వైసీపీ అధినేత జగన్ సంచలన కామెంట్స్, చంద్రబాబును కొట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , అందుకే హత్య రాజకీయాలు!