Perni Nani Slams Chandrababu: బామ్మర్ధులను తడిగుడ్డలతో గొంతకోసిన సైకో చంద్రబాబు, బందరులో పర్యటించే అర్హత చంద్రబాబుకు లేదని మండిపడిన పేర్ని నాని

వెన్నుపోటుకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అని మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. గురువారం ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 2014లో చంద్రబాబు ఇచ్చిన ఒక్కహామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.

perni-nani

VJY, April 13: నమ్మకానికి సీఎం జగన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అయితే.. వెన్నుపోటుకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అని మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. గురువారం ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 2014లో చంద్రబాబు ఇచ్చిన ఒక్కహామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.ఔటర్‌ రింగ్‌రోడ్డు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అన్నావ్‌.. తెచ్చావా?. బందరును హైదరాబాద్‌ మించిన సిటీ చేస్తానన్నావ్‌ చేశావా?. బందరులో పర్యటించే అర్హత చంద్రబాబుకు లేదు’’ అని పేర్ని నాని మండిపడ్డారు. త్వరలో సీఎం జగన్‌ బందరు పోర్టు పనులు ప్రారంభిస్తారని, శరవేగంగా బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ చంద్రబాబు ఎదుటే ఫ్యాన్స్ నినాదాలు, అసహనం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత, మచిలీపట్నంలో సాగిన చంద్రబాబు పర్యటన

‘‘చంద్రబాబు లాంటి పచ్చి రాజకీయ మోసగాడు ఎవరూ లేరు. నీరు-చెట్టు పథకంలో చంద్రబాబు రూ.2వేల కోట్లు కొట్టేశారు. జన్మభూమి కమిటీల పేరుతో పచ్చచొక్కాలకు దోచిపెట్టారు. చంద్రబాబు మళ్లీ తన పాలన తెస్తానని ప్రజలకు చెప్పగలరా?. జన్మభూమి కమిటీలను మళ్లీ ప్రవేశపెట్టగలరా?. తాను చేసిన ఒక్క మంచిపనైనా చెప్పగలరా?. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబును మించిన సైకో ఎవరున్నారు?. పిల్లనిచ్చిన మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.. బామ్మర్ధిలను తడిగుడ్డలతో గొంతకోసిన వాడు సైకో కాదా?’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు