Kanipakam Temple Closed: కాణిపాకంలో కరోనా కలకలం, 2 రోజుల పాటు వినాయకుని గుడి మూసివేత, దర్శనాలు రద్దు, ఈ నెల 21వ తేదీన కనకదుర్గ ఆలయం మూసివేత
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో (Kanipakam Temple) కరోనా కలకలం సృష్టించింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ( Swayambhu Varasiddhi Vinayaka Swamy temple) ఆలయ హోంగార్డుకు కరోనా వైరస్ (COVID-19) సోకడంతో భక్తుల అనుమతిని నిషేధించారు. రెండు రోజుల పాటు దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొత్తం 60 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
Tirupati, June 15: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో (Kanipakam Temple) కరోనా కలకలం సృష్టించింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ( Swayambhu Varasiddhi Vinayaka Swamy temple) ఆలయ హోంగార్డుకు కరోనా వైరస్ (COVID-19) సోకడంతో భక్తుల అనుమతిని నిషేధించారు. రెండు రోజుల పాటు దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొత్తం 60 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. నేటి నుంచి కర్ణాటకకు ఏపీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ బుకింగ్, ముందుగా 168 బస్సు సర్వీసులతో ప్రారంభం, apsrtconline.in ద్వారా రిజర్వేషన్ చేసుకునే సదుపాయం
రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,858కి చేరింది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 1,068కాగా, విదేశాల నుంచి వచ్చిన వారు 202 మంది ఉన్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు భౌతికదూరం పాటించడంతో పాటు విధిగా మాస్క్‌లు ధరించాలని అధికారులు సూచించారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని వారు స్పష్టం చేశారు.
Here's The New Indian Express Tweet
Here's Video
ఇదిలా ఉంటే వచ్చే ఆదివారం 21వ తేదీన సూర్యగ్రహణం (Solar eclipse) నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయాలతో (vijayawada durga temple) పాటు ఇతర ఉపాలయాలను మూసివేయనున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. 20వ తేదీ సాయంత్రం అమ్మవారికి పంచ హారతుల అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తారు. గత 24 గంటల్లో 325 మంది మృతి, దేశ వ్యాప్తంగా 3,32,424కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, నవంబర్ రెండో వారం నాటికి గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందన్న ఐసీఎంఆర్
సూర్య గ్రహణం 21వ తేదీ ఉదయం 10–25 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1–54 గంటలకు విడుస్తుందని పేర్కొన్నారు. గ్రహణం వీడిన అనంతరం మధ్యాహ్నం 2–30 గంటలకు ఆలయాన్ని తెరిచి శుభ్రపరుస్తారు. అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాయంత్రం పంచహారతుల అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ఈ నేపథ్యంలో 21వ తేదీ అన్ని దర్శనాలను రద్దు చేశారు. 22వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలకు దర్శనాలు యథావిధిగా ప్రారంభమవుతాయని తెలిపారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)