Antarvedi Temple: అనుకున్న సమయానికే..పూర్తయిన అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి నూతన రథం, ట్రయల్ రన్ సక్సెస్, . ఏడంతస్తుల రథం పూర్తి స్ట్రక్చర్ నిర్మాణం పూర్తి

ఏడంతస్తుల రథం పూర్తి స్ట్రక్చర్ నిర్మించడంతో పాటు చక్రాలు కూడా ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి రథం (Sri Lakshmi Narasimha Swamy Devasthanam) గతంలో మంటల్లో కాలిపోయిన సంగతి విదితమే.

Antarvedi Temple (Photo-Video Grab)

Amaravati, Dec 28: అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి నూతన రథం​ పూర్తయింది. ఏడంతస్తుల రథం పూర్తి స్ట్రక్చర్ నిర్మించడంతో పాటు చక్రాలు కూడా ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి రథం (Sri Lakshmi Narasimha Swamy Devasthanam) గతంలో మంటల్లో కాలిపోయిన సంగతి విదితమే. కాగా మూడు నెలల రికార్డు సమయంలో అధికారులు ప్రధాన నిర్మాణాన్ని పూర్తి చేశారు. మంత్రి వేణు గోపాల కృష్ణ ,జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కూడా రథాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

దేవాదాయశాఖ అధికారులు నేడు రథం ( new chariot of Sri Lakshmi Narasimha Swamy Devasthanam) ట్రయల్‌ రన్ నిర్వహించారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా నిర్మితమవుతున్న రథాన్ని తాళ్ళుతో లాగుతూ బయటకు తీసుకు వెళ్లారు. రధం (New Antarvedi chariot) సునాయాసంగా కదలడంతో ట్రయల్‌ రన్ విజయవంతంగా ముగిసింది. పాత రథానికి భిన్నంగా కొత్త రథంలో బ్రేక్ సిస్టం కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు రధం కింద జాకీలు అమర్చి అవసరమైన చోట సునాయసంగా వెనక్కి తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.

Here's  New chariot of Sri Lakshmi Narasimha Swamy Trail Run Videos

నాలుగు నెలల క్రితం రథం దగ్ధమైన కావడం... ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఏపీ సర్కారు, వెంటనే కొత్త రథం నిర్మాణం, రథశాల మరమ్మతులకు తక్షణం రూ.95 లక్షలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో పాత రథం నమూనాలోనే రథం 21 అడుగుల పొడవు,16 అడుగుల వెడల్పు, 41 అడుగుల ఎత్తున, ఆరు చక్రాలతో కొత్త రథం డిజైన్‌ దేవదాయ శాఖ ఖరారు చేసింది. నూతనరథం తయారీకి సుమారు 1,330 ఘనపుటడుగుల బస్తర్‌ టేకును వినియోగించారు.

జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం, ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ, ఏపీలో పూర్తయిన అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి నూతన రథం

కొత్త రథం తయారీ పనులకు సెప్టెంబర్‌ 27న జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ పనులను దేవదాయ శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు 90 రోజుల్లో పూర్తి చేశారు. పెయింటింగ్‌ మినహా ఇతరపనులన్నీ పూర్తయ్యాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినమైన శుక్రవారం రథానికి శిఖరం కూడా అమర్చారు.