AP Budget Session 2022: మూడు రాజధానుల అంశంపై ధర్మాన కీలక వ్యాఖ్యలు, ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదన్న విషయాన్ని కోర్టులు గుర్తుపెట్టుకోవాలని తెలిపిన వైసీపీ ఎమ్మెల్యే
12వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో (AP Budget Session 2022) పరిపాలన వికేంద్రీకరణపై కీలక చర్చకు అసెంబ్లీ కార్యదర్శి సప్లిమెంటరీ అజెండాను జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో మూడు రాజధానులు అంశంపై కీలక చర్చ జరగుతోంది.
Amaravati, Mar 24: 12వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో (AP Budget Session 2022) పరిపాలన వికేంద్రీకరణపై కీలక చర్చకు అసెంబ్లీ కార్యదర్శి సప్లిమెంటరీ అజెండాను జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో మూడు రాజధానులు అంశంపై కీలక చర్చ జరగుతోంది. శాసన-న్యాయ అధికారాల పరిధిపై సీనియర్ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) లేవనెత్తిన అంశంపై సభలో చర్చించారు.
కాగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని, శాసన సభలకు శాసనాలు చేసే హక్కులేదని గత ఇరవై రోజుల క్రితం ఏపీ హైకోర్టు (AP High court) తీర్పునివ్వడంతో వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు. అసలు శాసన సభకు, మండలికి ఉన్న హక్కులు ఏమిటి, సభ్యులకున్న అధికారాలు ఏమిటి అనే విషయంలో శాసనసభ చర్చిం చాలని స్పీకర్‌కు లేఖ రాయడంతో ఇవాళ స్పీకర్ స్వల్పకాలిక చర్చకు అనుమతి ఇచ్చారు
మూడు రాజధానుల అంశంపై ధర్మాన ప్రసాద్‌రావు మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీకి (AP Assembly Budget Session 2022-2023) కొన్ని పరిమితులను పెడుతూ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానులపై అసెంబ్లీ చట్టం చేయొద్దంటూ హైకోర్టు తెలిపింది. హైకోర్టు తీర్పు తర్వాత సభానాయకుడికి లేఖ రాశా. న్యాయనిపుణులతో కూడా ఈ విషయంపై చర్చించా. కోర్టులంటే అందరికి గౌరవం ఉంది. అయితే దీనిపై సభలో చర్చించాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నా. ఒకరి విధి నిర్వహణలో మరొకరు జోక్యం చేసుకోవద్దు. రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చకుండా అడ్డుపడొద్దు. న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు వేటికవే వ్యవహరించాలి. ఒకప్పుడు దేశంలో రాజరిక వ్యవస్థ ఉండేది. అధికారం రాజు చేతుల్లోనే ఉండేది. రాచరికం నుంచి తర్వాతి రోజుల్లో ప్రజాస్వామ్యం వచ్చిందని అన్నారు.
సభలో చర్చించేందుకు అనుమతినిచ్చినందుకు ధన్యవాదాలు. రాజ్యాంగం రావడానికి వెనక ఎంతో మంది గొప్ప వాళ్ల కృషి ఉంది. ప్రజలు ఎన్నుకొన్న ప్రతినిధులతో పాలన చేయాలని రాజ్యాంగం చెప్పింది. ప్రజాభిప్రాయం కేవలం శాసన వ్యవస్థలోనే ప్రభావితం అవుతుంది. ప్రజల చేత, ప్రజల కొరకు అని రాజ్యాంగంలో రాసుకుంది శాసన వ్యవస్థ గురించే. శాసనసభ, లోక్‌సభ.. ఈ రెండు వ్యవస్థలను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కారు, కాలేరు. ప్రపంచంలోనే అత్యంత పురాతన లిఖిత రాజ్యంగం 1788లో అమెరికాది. మన దేశంలో రాజ్యాంగం 72 ఏళ్ల కింద 1950లో అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం తమను కాపాడుతుందన్న భరోసాలో ప్రతీ ఒక్కరు ఉంటారు. మన లక్ష్యం ఎంత గొప్పదో.. మార్గం కూడా అంత గొప్పగా ఉండాలని గాంధీ చెప్పారు. ఎవరి పరిధి ఏంటీ? ఎవరి విధులేంటీ? అన్న దానిపై స్పష్టత రావాలి. ఈ స్పష్ట రాకుంటే వ్యవస్థలో గందరగోళం వచ్చే అవకాశం ఉంది’ అని తెలిపారు.
జ్యుడీషియల్ యాక్టివిజం పేరుతో కోర్టులు విధులు నిర్వహించరాదని చెప్పిందని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో పాలనా విభజనపై ఆయన మాట్లాడుతూ..‘అధికార వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. సమాజం పట్ల పూర్తి బాధ్యత ఉందని సుప్రీంకోర్టు గతంలో ప్రకటించింది. ఒకవేశ శాసన వ్యవస్థ సరిగా పనిచేయకుంటే అది ప్రజలు చూసుకుంటారు. అంతే కానీ శాసన వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పింది.
రాజ్యాంగంలోని మూడు వ్యవస్థల పరిధి ఎంత మేరకు అన్నది కోర్టులో చెప్పాలి. ఎంత నిగ్రహంతో కోర్టులు వ్యవహరించాలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు అన్న విషయాన్ని కోర్టులు గుర్తుపెట్టుకోవాలి. సమానమైన హక్కులు, అధికారాలు మూడు వ్యవస్థలకు కూడా ఉన్నాయి. న్యాయ వ్యవస్థలో స్వీయ నియంత్రణ ఉండాలని తీర్పులు ఎన్నో చెప్పాయి. న్యాయ వ్యవస్థకు ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టులదే అని చెప్పాయి. లేని అధికారాలను కోర్టులు సృష్టించుకోలేవని సుప్రీం తీర్పుల్లో స్పష్టంగా ఉంది’ అని ధర్మాన తెలిపారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి: ఏపీ అసెంబ్లీలో విక్రేంద్రికరణపై చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ.. రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్‌ను విభజించారని అన్నారు. మూడు రాజధానుల అంశం కులాల సమస్య కాదని తెలిపారు. దీన్ని ప్రాంతాల మధ్య సమతుల్యతగా భావించాలని పేర్కొన్నారు. రాజధాని పేరుతో దోచుకోవటమే చంద్రబాబు లక్ష్యమని అన్నారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనకబడిన ప్రాంతాలని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఈ జిల్లా ప్రజలు ఇతర రాష్ట్రాలు, నగరాలకు వెళ్లి కూలీలుగా పనిచేస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు. అటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దశంతో.. రాయలసీమ అభివృద్ధిలో భాగంగా అక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తే తప్పేముందని అన్నారు. పారిపాలన రాజధానిగా విశాఖపట్నంను డిసైడ్ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు
ఏపీ అసెంబ్లీలో వికేంద్రికరణపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను న్యాయవ్యవస్థల మంచి కోసమే మాట్లాడుతున్నానని అన్నారు. స్వీయనియంత్రణ ఏ వ్యవస్థకైనా తప్పనిసరి అని తెలిపారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)