AP Budget Sessions 2022: పదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, ఫైబర్‌ గ్రిడ్‌ స్కాం మీద కొనసాగుతున్న చర్చ
Andhra pradesh Assembly Session for Three Capitals Confirmed on 20th(photo-PTI)

Amaravati, Mar 22: పదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Budget Sessions 2022) ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఫైబర్ గ్రిడ్ అవినీతిపై ( fibre grid scam) వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రశ్నించారు. మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి (Balineni Srinivasa Reddy) సమాధానమిచ్చారు. ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్లలో 5 కంపెనీలు పాల్గొన్నాయని, టెండర్లు వేయడానికి ఒక రోజు ముందు టెరాసాఫ్ట్‌ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌ నుంచి తొలగించారని మంత్రి బాలినేని శ్రీనివాస్‌ ఆరోపించారు. టెరాసాఫ్ట్‌ కంపెనీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడని, టెండర్లలో టెరాసాఫ్ట్‌ కంపెనీ తక్కువ కోడ్‌ చేసినప్పటికీ వారికే టెండర్‌ దక్కిందని చెప్పారు.

టెరాసాఫ్ట్ కంపెనీ చంద్రబాబుకి (Chandra Babu) అత్యంత సన్నిహితులది. బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్లు ఇచ్చారు. వాళ్లు నాసిరకంగా పనులు చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. బ్లాక్ లిస్టు చేసిన అధికారి దాన్ని తొలగించాలి. కానీ ఆయన కింద స్థాయి అధికారి దాన్ని తొలగించారు. బ్లాక్ లిస్టులో ఉన్నప్పటికీ టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించారు. దీనికి అప్పటి ప్రభుత్వ పెద్దల సహాకారం ఉంది. నకిలీ సర్టిఫికెట్స్ కూడా పెట్టి అర్హత సాధించారు. ఈ విషయంలో ప్రభుత్వం విచారణ చేస్తోంది. దీనిలో ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టేది లేదు. కచ్చితంగా వీరికి శిక్ష పడుతుంది' అని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

ముంచుకొస్తున్న ముప్పు, దూసుకొస్తున్న మరో తుఫాన్, అసని నుంచి భారత్‌కు ముప్పు తక్కువని తెలిపిన ఐఎండీ, తాండ్వే సమీపంలో తీరం దాటే అవకాశం

పెగాసస్‌ స్పైవేర్‌ పెద్ద స్కాం అని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ అన్నారు. 'ఇది స్పైవేర్‌ స్కాంలకు తల్లివేరు లాంటిది. ఫైబర్‌గ్రిడ్‌ పెద్ద స్కాం. ఈ టెండర్స్‌లో భారీగా అవకతవకలు జరిగాయి. టెండర్లు వేయడానికి కంపెనీ ఏర్పాటు చేసి 3 ఏళ్లయి ఉండాలి. కనీసం రూ.350 కోట్లు ఉండాలన్నది టెండర్‌ కండీషన్‌. నిబంధనలు పాటించకుండా ఫైబర్‌గ్రిడ్‌ను టెర్రాస్‌ కంపెనీకి అప్పగించారు. అనుభవం లేని టెర్రాస్‌ కంపెనీకి ఫైబర్‌గ్రిడ్‌ అప్పగించారని మద్దిశెట్టి వేణుగోపాల్‌ అన్నారు.

తీరం వైపు దూసుకొస్తున్న అసని తుఫాన్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఏపీలో కోస్తా, రాయలసీమలో నేడు, రేపు వర్షాలు

ఇక సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బాలినేని సమాధానమిస్తుండగా టీడీపీ సభ్యులు (TDP MLAs) వింతగా ప్రవర్తించారు. టీడీపీ సభ్యుడు సాంబశివరావు విజిల్‌ వేశారు. దీనిపై సీరియస్‌ అయిన స్పీకర్‌.. సభా మర్యాదను కాపాడాలంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ నుంచి మరోసారి టీడీపీ సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. సభకు పదేపదే ఆటంకం కలిగించడంతో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. బెందాళం అశోక్, రామరాజు, సత్యప్రసాద్‌, రామకృష్ణ లపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 25వరకు సాంబశివరావు, గద్దె రామ్మోహన్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. విజిల్‌ వేసిన మిగతా టీడీపీ సభ్యులు ఈ ఒక్క రోజు సస్పెండ్‌ చేశారు.

శాసనమండలిలో మద్యపాన నిషేధంపై తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై మంత్రి బుగ్గన వివరణ ఇస్తుండగా సభ్యులు ఆందోళన చేశారు. దీంతో చైర్మన్‌ శాసనమండలిని 10 నిమిషాలపాటు వాయిదా వేశారు.