AP Budget Session 2022: చంద్రబాబు ఇంటి పేరు నారా బదులు సారా అని పెడితే బాగుంటుందని జగన్ ఎద్దేవా, చంద్రన్న కానుకలే ఈ చీప్‌ లిక్కర్‌ బ్రాండ్లు, మేం అనుమతులు ఇచ్చింది లేదని తెలిపిన ఏపీ సీఎం
YS Jagan (Photo-Twitter)

Amaravati, Mar 23: ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం వాయిదా పడ్డాయి. తిరిగి రేపు(గురువారం)ప్రారంభం కానున్నాయి. నేటి సమావేశాల్లో (AP Budget Session 2022) ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి సస్పెన్షన్‌కు గురయ్యారు. రెండు రోజుల పాటు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం (Andhra Pradesh Assembly Speaker) ప్రకటించారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చిడతలు వాయిస్తూ సభా కార్యకలాపాలకు పదేపదే ఆటంకం కలిగించడంతో స్పీకర్‌ ఈ నిర్ణయాన్ని (suspends TDP MLAs for Two days) తీసుకున్నారు.

ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేల తీరును స్పీకర్‌ తప్పుపట్టారు. ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ టీడీపీ సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని సీరియస్‌ అయ్యారు. ఒక రోజు శాసనసభ నిర్వహణకు రూ.53.28లక్షలు ఖర్చవుతుంది. ఒక నిమిషం సభ నిర్వహణకు రూ. 88,802 ప్రజాధనం ఖర‍్చవుతుంది. ప్రభుత్వం ప్రజా సమస్యల్ని చర్చిండానికి ఇంత ఖర్చుపెడుతుంటే టీడీపీ సభ్యులు సభా సమయాన్ని ఇలా నిరుపయోగం చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గదు, అసెంబ్లీ వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఏపీ సీఎం జగన్, 2023 ఖరీఫ్‌ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని వెల్లడి

ఇక ఏపీ శాసన మండలిలోనూ టీడీపీ సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. బచ్చుల అర్జునుడు, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, రామ్మోహన్‌, దువ్వాడ రామారావు, రవీంద్రనాథ్‌రెడ్డిని మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ఒక్క రోజు సస్పెండ్‌ చేశారు. మంత్రుల ప్రసంగాన్ని పదేపదే అడ్డుకున్నారు. ఛైర్మన్‌ పోడియంపైకి ఎక్కి ఆందోళన చేశారు. దీంతో ఛైర్మన్‌ మోషేన్‌ రాజు సస్పెన్షన్‌ వేటు వేశారు. శాసనమండలిలో టీడీపీ సభ్యుల తీరు బాధాకరమని మంత్రులు బొత్స, కన్నబాబు అన్నారు. సభలో గందరగోళం చేయడం మంచి పద్ధతి కాదు. తెలుగుదేశం సభ్యులు ఛైర్మన్ స్థానాన్ని అగౌరవ పరుస్తున్నారు. పోడియం పైకెక్కిన తెలుగుదేశం సభ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎవరైతే పోడియం పైకి ఎక్కారో వారిని వెంటనే సస్పెండ్ చేయండి అని శాసనమండలిని ఛైర్మన్‌ను మంత్రి బొత్స కోరారు.

బుధవారం మద్యం పాలసీపై అసెంబ్లీ సమావేశాల్లో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో సీఎం జగన్ మాట్లాడుతూ... చంద్రబాబు ఇంటి పేరు నారా బదులు సారా అని పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం జరుగుతోందని సీఎం జగన్‌ వివరించారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీలకుగానూ 14 డిస్టీలరీలకు అనుమతి ఇచ్చిన పాపం చంద్రబాబుదేనని, 2019 తర్వాత ఒక్క డిస్టిలరీకి గానీ, ఒక్క బ్రూవరీకిగాని తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్‌ గుర్తు చేశారు. నవరత్నాలు, అమ్మ ఒడి.. ఇవీ మా ప్రభుత్వ బ్రాండ్లు. ప్రెసిడెంట్‌ మెడల్‌, గవర్నర్‌ ఛాయిస్‌ భూంభూం బీర్‌, పవర్‌ స్టార్‌ 999, 999 లెజెండ్‌.. బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలే.

పదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, ఫైబర్‌ గ్రిడ్‌ స్కాం మీద కొనసాగుతున్న చర్చ

ఇవన్నీ చంద్రబాబు ఆశీస్సులతో వచ్చిన బ్రాండ్లే. ప్రెసిడెంట్‌ మెడల్‌ బ్రాండ్‌.. చంద్రబాబు మెడల్‌ బ్రాండ్‌. గవర్నర్‌ ఛాయిస్‌ 2018, నవంబర్‌ 5న అనుమతి ఇచ్చింది చంద్రబాబే. ఆయన దిగిపోయే చివరి క్షణం వరకు లిక్కర్‌ బ్రాండ్‌లకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లు వచ్చాయి. ఇవన్నీ ఆయన ట్రేడ్‌ మార్క్‌ బ్రాండ్లు. కానీ, ఈ బ్రాండ్లను మేం క్రియేట్‌ చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. స్పెషల్‌ స్టేటస్‌, త్రీ క్యాపిటల్‌ అంటూ తప్పుడు లేబుల్స్‌తో ప్రచారం చేసిన ఘనత కూడా టీడీపీ నేతలదేనని సీఎం జగన్‌ అన్నారు.

2019 తర్వాత మా ప్రభుత్వం ఒక్క బ్రాండ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదు. మేం అమ్మే బ్రాండ్‌లన్నీ లైసెన్స్డ్‌ డిస్టిలరీస్‌ నుంచి వచ్చినవే. మనిషి పరంగా చంద్రబాబు, పార్టీపరంగా టీడీపీ , మరో వైపు ఎల్లో మీడియా ఇవే అసలు సిసలైన చీప్‌ బ్రాండ్స్‌. ఏ షాపు నుంచి తీసుకొచ్చారో ఆధారాలు లేకుండా శాంపిల్స్‌ టెస్టింగ్‌కు ఇచ్చారు. ఇక్కడ శాంపిల్స్‌లో ట్యాంపరింగ్‌ కూడా చేసి ఉండొచ్చు కదా. వారు ఇచ్చిన లైసెన్స్‌డ్‌ డిస్టిలరీస్‌ నుంచే మద్యం విక్రయిస్తున్నాం. అప్పుడు అది విషంగా ఎలా మారుతుందని ప్రశ్నించారు సీఎం జగన్‌.

ఏపీలో పెగాసస్‌ స్పైవేర్‌ ప్రకంపనలు, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలు బయటకు వస్తున్నాయని వెల్లడి

మా ప్రభుత్వం 16 మెడికల్‌ కాలేజీలకు అనుమతిస్తే.. డిస్టిలరీలకు అనుమతి ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, సహజ మరణాలను కల్తీ సారా మరణాలుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారంటూ సీఎం జగన్‌ ఆక్షేపించారు. టీడీపీ నేతలవి క్రిమినల్‌ బ్రెయిన్స్‌ అని, వాళ్లందరినీ జూలో పెట్టడమే కరెక్ట్ అంటూ సీఎం జగన్‌ చమత్కరించారు. పీఎంకే డిస్టిలరీస్‌ యనమల వియ్యంకుడిది కాదా?, శ్రీకృష్ణ డిస్టిలరీస్‌ ఆదికేశవులనాయుడిది కాదా? విశాల డిస్టిలరీస్‌ ఎవరిది? అయ్యన పాత్రుడిది కాదా? అని సీఎం జగన్‌.. సభాముఖంగా నిలదీశారు

మంత్రి కొడాలి నాని: ఆంధ్రప్రదేశ్‌లో 240 మద్యం బ్రాండ్లకు పర్మిషన్లు ఇచ్చిన నీచ ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది అని మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చీప్‌ లిక్కర్‌ను భారతదేశంలో కనిపెట్టిన చీప్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే మళ్లీ లిక్కర్‌ను రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన 420 చంద్రబాబు నాయుడని విమర్శించారు. చంద్రబాబు అల్జీమర్స్‌తో బాధపడుతున్నారు. 240 బ్రాండ్స్‌కు పర్మిషన్‌ ఇచ్చింది చంద్రబాబు. చంద్రబాబు రాష్ట్రాన్ని పాలించడం మన దురదృష్టం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. టీడీపీని ఎవరు పట్టుకుంటే వారు సర్వనాశనం అవుతారు. తెలంగాణలో టీడీపీకి ఏ గతి పట్టిందో ఏపీలో అదే గతి పడుతుందని మంత్రి కొడాలి నాని అన్నారు..

అదే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక 45వేల బెల్ట్‌ షాప్‌లను రద్దు చేసినట్లు తెలిపారు. అదే విధంగా బడులు, దేవాలయాల వద్ద ఉన్న వైన్స్‌ షాపులను తీసేయించిన ఘనత సీఎం జగన్‌ది అని కొనియాడారు. చంద్రబాబు అల్జీమర్స్‌తో బాధపడుతున్నారని చంద్రబాబు రాష్ట్రాన్ని పాలించడం మన దురదృష్టకరమని విమర్శించారు. టీడీపీని ఎవరు పట్టుకుంటే వారు సర్వనాశనం అవుతారన్నారు​. తెలంగాణలో టీడీపీకి ఏ గతి పట్టిందో ఏపీలో అదే గతి పడుతుందని మంత్రి కొడాలి నాని విమర్శించారు. టీడీపీ నాయకులు పార్టీ మారాలని, లేదా తమ నాయకుడిని అయినా మార్చుకోవాలని హితవు పలికారు.

ఎమ్మెల్యే పార్థసారధి: రాష్ట్రంలో మద్యాపాన నిషేధాన్ని ఎత్తేసేందుకు చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. మద్యం పాలసీపై స్వల‍్పకాలిక చర్చలో ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ.. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతోందని ఆనాడు చంద్రబాబు మద్యానికి తలుపులు తెరిచారని అన్నారు. డిస్టిలరీస్‌ నుంచి రూ.వేల కోట్లు వసూలు చేశారని ఎమ్మెల్యే పార్థసారథి అ‍న్నారు. ప్రెసిడెంట్‌ మెడల్‌ అనేది టీడీపీ బ్రాండ్‌ అని ఎద్దేవా చేశారు. ప్రెసిడెంట్‌ మెడల్‌ అనేదానికి చంద్రబాబే పర్మిషన్‌ ఇచ్చారని అన్నారు. ఊరూరా మద్యాన్ని ఏరులై పారించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు.

ఇక ఐదేళ్ల అమావాస్య చంద్ర పాలన పుస్తకావిష్కరణ బుధవారం జరిగింది. ఐదేళ్ల అమావాస్య చంద్రపాలన పుస్తకాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని మాజీ సీపీఆర్వో విజయ్ కుమార్ రచించారు.