AP Assembly Sessions 2022: టీడీపీ డేటా చౌర్యానికి పాల్పడింది, సేవా మిత్ర యాప్‌ ద్వారా సుమారు 30 లక్షల ఓట్లు రద్దు చేయాలని చూసింది, అసెంబ్లీలో ఎమ్మెల్యే భూమన

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగింది వాస్తవమేనని..పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై ఏర్పాటైన సభా సంఘం చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ధృవీకరించారు.

MLA Bhumana Karunakar Reddy (Photo-Twitter)

Amaravati, Sep 20: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగింది వాస్తవమేనని..పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై ఏర్పాటైన సభా సంఘం చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ధృవీకరించారు. అసెంబ్లీ సమావేశాల్లో (AP Assembly Sessions 2022) భాగంగా.. ఇవాళ (మంగళవారం) డేటా చోరీ వ్యవహారంపై విచారణ చేపట్టిన హౌజ్‌ కమిటీ రూపొందించిన మధ్యంతర నివేదికను ఆయన చదివి వినిపించారు.

ప్రాథమిక విచారణలో గత టీడీపీ ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడినట్లు సభా సంఘం నిర్ధారణకు వచ్చిందని భూమన తెలియజేశారు. 2017-19.. మరీ ముఖ్యంగా 2018-19 మధ్యకాలంలో ప్రైవేట్‌ సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి.. తెలుగుదేశానికి చెందిన సేవా మిత్ర యాప్‌ ద్వారా సుమారు 30 లక్షల ఓట్లు రద్దు చేసే ప్రక్రియకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, దీనిని తమ విచారణలో సభాసంఘం గుర్తించినట్లు భూమన తెలిపారు.

మనబడి నాడు-నేడు ద్వారా 57వేల స్కూళ్లు అభివృద్ధి, అమ్మ ఒడితో మూడేళ్లలో 84లక్షల మంది పిల్లలకు లబ్ది, విద్యారంగంపై సీఎం జగన్

ఓట్లు వేయనివాళ్ల సమాచారాన్ని స్టేట్‌ డేటా సెంటర్‌ నుంచి సేవా మిత్ర అనే యాప్‌ ద్వారా పూర్తిగా చోరీ చేసే యత్నం చేశారని, ఆ చౌర్యం చేసిన చోరులను పట్టుకోవాల్సిన బాధ్యతను తాము లోతుకు వెళ్లి విచారిస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రాథమిక విచారణ నివేదికను స్పీకర్‌కు చదివి వినిపించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement