AP Assembly Sessions 2022: మనబడి నాడు-నేడు ద్వారా 57వేల స్కూళ్లు అభివృద్ధి, అమ్మ ఒడితో మూడేళ్లలో 84లక్షల మంది పిల్లలకు లబ్ది, విద్యారంగంపై సీఎం జగన్

గతంలో కార్పొరేట్‌ స్కూళ్లకు ( Education Department) మేలు కలిగించేలా విధానాలు ఉండేవి. డ్రాప్‌ ఔట్‌ రేట్‌ పెరుగుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మేం వచ్చాక విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టాం.

AP CM YS Jagan (Photo-Video Grab)

Amaravti, Sep 20: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి.ఈ సమావేశాల్లో భాగంగా విద్యారంగంలో నాడు- నేడుపై (CM YS Jagan Speech on Nadu Nedu ) మంగళవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Speech) మాట్లాడుతూ.. ప్రపంచంలో విద్యావవస్థ వేగంగా మారుతోంది. గతంలో కార్పొరేట్‌ స్కూళ్లకు ( Education Department) మేలు కలిగించేలా విధానాలు ఉండేవి. డ్రాప్‌ ఔట్‌ రేట్‌ పెరుగుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మేం వచ్చాక విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టాం.

కార్పొరేట్‌ స్కూళ్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. మానవ వనరులపై పెట్టుబడి పెడుతన్నాం. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలోనూ స్కూళ్లను పట్టించుకోలేదు. కుప్పంలో స్కూళ్లు దీనావస్థలో ఉండేవి. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూళ్లను గాలికొదిలేశారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశాం. మనబడి నాడు-నేడు ద్వారా 57వేల స్కూళ్లు, హాస్టళ్లు అభివృద్ధికి రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఉన్నత విద్యను హక్కుగా మార్చాం​.

వేలకోట్లు బటన్ నొక్కి వేస్తున్నాం, రూ. 500 కోట్లు వేయలేమా, టీడీపీ నేతకు అసెంబ్లీలో సీఎం జగన్ సమాధానం, అసెంబ్లీలో పోలవరంపై కొనసాగుతున్న చర్చ

మొదటి దశలో 15717 స్కూళ్లలో నాడు-నేడు పూర్తయింది. రెండో దశలో భాగంగా 22వేల స్కూళ్లలో అభివృద్ధి చేస్తున్నాం. నిర్మాణంపైనే కాదు నిర్వహణపైనా దృష్టి పెట్టాం. టాయిలెట్లు, స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేశాం. విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా పిల్లలకు అండగా నిలుస్తున్నాం. గతంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ అట్టడుగున ఉన్న పరిస్థితి. మన ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడులకు పునర్‌ వైభవం కల్పించాం. అమ్మ ఒడి పథకం ఓ విప్లవాత్మక ముందడుగు. దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా కూడా లేదు.

అమ్మ ఒడితో (Amma Vodi) మూడేళ్లలో 84లక్షల మంది పిల్లలకు లబ్ది చేకూరింది. అమ్మ ఒడి పథకానికి రూ.17వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టాం. జగనన్న గోరుమద్దు పథకంతో పౌష్టికాహారం అందిస్తున్నాం. సరుకుల బిల్లులను కూడా గత ప్రభుత్వం చెల్లించలేదు. మన ప్రభుత్వం వచ్చాక ఆయాల గౌరవ వేతనం వెయ్యి నుంచి 3వేలకు పెంచాం.



సంబంధిత వార్తలు

Woman Chops Off Boyfriends Private Parts: పెళ్లికి ఒప్పుకోలేద‌ని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన యువ‌తి, ఆపై చేతిని కోసుకొని ఆత్మ‌హ‌త్య‌, ఆ త‌ర్వాత ఏమైందంటే?

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Andhra Pradesh Shocker: కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి, కొడుకు వేధింపులు భరించలేక అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య...వీడియో

AP Weather Update: ఏపీవాసులు ఊపిరిపీల్చుకునే కబురు.. బలహీనపడిన వాయుగుండం.. తప్పిన ముప్పు.. అయితే, రెండు రోజుల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif