AP Assembly Session 2022: దొడ్డి దారిలో నారా లోకేష్ మంత్రి కాలేదా, కొడాలినానిపై ఈగ వాలితే సహించేది లేదు,టీడీపీ నేతలపై మండిపడిన మంత్రి రోజా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session 2022) ప్రారంభమైన అనంతరం.. పది నిమిషాల వాయిదా సమయంలో ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది.
Amaravati, Sep 15: ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత అసలు టీడీపీకి ఉందా? అని ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session 2022) ప్రారంభమైన అనంతరం.. పది నిమిషాల వాయిదా సమయంలో ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. ప్రజా సమస్యలపై టీడీపీకి అసలు చిత్తశుద్ధే లేదు. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై టీడీపీ చర్చించడం లేదు. సభలో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది. వాళ్లకు రాజకీయాలే ముఖ్యం.. ప్రజలు కాదనే విషయం స్పష్టమవుతోందని ఆమె అన్నారు.బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ పెద్ద మోసం చేసిందని విమర్శించారు.
రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని మంత్రి రోజా (Minister Roja) వ్యాఖ్యానించారు. టీడీపీ (TDP) గ్రామాల్లో తిరిగితే ఎంత మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయో తెలుస్తుందన్నారు. మూడు రాజధానుల బిల్ పెట్టే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని టీడీఎల్పీ (TDLP) సమావేశంలో చర్చించారని.. ప్రజల మద్దతు ఉండబట్టే మూడు రాజధానుల విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావన చేస్తోందని, అందుకే రాజధాని ప్రాంతం సహా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందన్నారు. చంద్రబాబు (Chandrababu) వెనుక ఎంతమంది ఎమ్మల్యేలు ఉన్నారో తెలుసా? అని మంత్రి ప్రశ్నించారు.
మూడు రాజధానుల ప్రస్తావన వస్తే వైసీపీ ఎమ్మల్యేలు ఎందుకు రాజీనామా చేయాలన్నారు. రాంగ్ రూట్‌లో ఎమ్మెల్సీ అయిన లోకేష్ (Lokesh) సీఎం జగన్ (CM Jagan)పై అవాకులు చెవాకులు మాట్లాడితే ప్రజలతో కొట్టిస్తామన్నారు. మాజీ మంత్రి కొడాలినాని భాషలో తప్పేముందని మంత్రి ప్రశ్నించారు. ఆయనపై ఈగ వాలితే సహించేది లేదని హెచ్చరించారు. టీడీపీ రౌడీయీజం చేస్తూ ఇళ్ళపై దాడి చేస్తారా? అంటూ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.