AP Assembly Session 2022: అచ్చెన్నాయుడికి సీఎం జగన్ బంపరాఫర్, మీరు ఏం అంశం కావాలన్నా చర్చకు మేం రెడీ.సభలో చర్చకు సహకరిస్తారా? లేదా? ప్రశ్నించిన సీఎం

సభ ప్రారంభం కాగానే ఈ మధ్యకాలంలో కన్నుమూసిన నేతలకు.. ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది.

AP CM YS Jagan (Photo-Video Grab)

Amaravati, Sep 15: ఏపీలో తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు (Ap Assembly Session 2022) తొలి రోజే హాట్ హాట్ గా ప్రారంభం అయ్యాయి.టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డుపడ్డుతున్నారు. సభ ప్రారంభం కాగానే ఈ మధ్యకాలంలో కన్నుమూసిన నేతలకు.. ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పులపర్తి నారాయణమూర్తి, జేఆర్‌ పుష్పరాజ్‌, నల్లమిల్లి మూలారెడ్డి మృతి పట్ల సభ్యులు సంతాపం ప్రకటించారు.అనంతరం వాడీ వేడీ చర్చ జరిగింది.

విరామం తర్వాత స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం (BAC Meeting) జరిగింది. ఈ సమావేశంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో పాటు సభ్యులు బుగ్గన, పెద్దిరెడ్డి, జోగి రమేస్‌, ప్రసాద్‌రాజు, శ్రీకాంత్‌రెడ్డిలు పాల్గొన్నారు. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు.కాగా బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. అచ్చెన్నాయుడికి ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈనెల 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, టీడీపీ ప్రతిపాదించిన 27 అంశాలపై చర్చకు సిద్ధమని తెలిపిన ప్రభుత్వం

మీరు ఏం అంశం కావాలన్నా చర్చకు మేం రెడీ. సభలో చర్చకు సహకరిస్తారా? లేదా?. మీరు కోరే ప్రతీ అంశంపైనా చర్చిస్తాం. అవసరమైతే ఈఎస్‌ఐ స్కాంపైనా చర్చిద్దాం. రాజధానిది కావాలంటే అది కూడా చర్చ పెడదాం. సభ నిర్వహణను మాత్రం అడ్డుకోవద్దని అచ్చెన్నాయుడితో సీఎం జగన్‌ చెప్పినట్లు తెలుస్తోంది.చర్చకు సహకరించకుండా గొడవ చేయడం సమంజసం కాదని టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులు బీఏసీలో అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీఎంను ఏదైనా అంటే ఊరుకునేది లేదని, చంద్రబాబే రెచ్చగొట్టి ఎమ్మెల్యేలను గొడవకు పంపిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.



సంబంధిత వార్తలు

Andhra Pradesh Assembly Session: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా

YS Sharmila: జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన వైఎస్‌ షర్మిల, ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు..ఇదంతా చేయించింది జగనే...అప్పుడు ఎందుకు ఎంక్వైరీ అడగలేదో చెప్పాలని షర్మిల డిమాండ్

PAC Elections: వైసీపీ సంచలన నిర్ణయం, పీఏసీ ఎన్నికలను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించిన పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Gautam Adani Bribery Case: లంచం ఆరోపణలను ఖండించిన వైసీపీ, అదాని గ్రూపుతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని ప్రకటన, సెకీతోనే ఒప్పందం చేసుకున్నామని వెల్లడి