AP Assembly Session 2023 Day 4: అసెంబ్లీలో ఫైబర్‌ నెట్‌ స్కామ్‌పై చర్చ, చంద్రబాబు హయాంలో రూ. 114 కోట్లు కొట్టేశారని తెలిపిన మంత్రి గుడివాడ అమరనాథ్

114 కోట్లు కొట్టేశారని తెలిపారు.

MLA Gudivada Amarnath(Photo-Video Grab)

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొనసాగాయి. అసెంబ్లీలో ఫైబర్‌ నెట్‌ స్కామ్‌పై చర్చ జరిగింది. అలాగే బీసీ జనగణనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చల అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. శాసనమండలిలో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలపై చర్చ జరిగింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. అసెంబ్లీలో ఫైబర్‌ నెట్‌ స్కామ్‌పై చర్చ సందర్భంగా మంత్రి గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ..చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ స్కామ్‌లో రూ. 114 కోట్లు కొట్టేశారని తెలిపారు.

మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, నాడు టెండర్ దక్కించుకున్న టెరాసాఫ్ట్ సంస్థకు, ఈ కేసులో ఏ1 వేమూరి హరికృష్ణప్రసాద్ అనే వ్యక్తికి లింకులు ఉన్నాయని అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, టెండరు ప్రక్రియ ముగిసిన తర్వాత టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి హరిప్రసాద్ తొలగించబడ్డాడు. హెరిటేజ్ సంస్థకు చెందినవారే టెరా కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు. చంద్రబాబు తనకు తెలిసినవారికే టెండర్లు కట్టబెట్టారు.

వై నాట్ 175తో పాటుగా జగన్ మరో కొత్త వ్యూహం, వై ఏపీ నీడ్స్‌ జగన్‌ స్లోగన్‌తో ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు, కార్యకర్తలకు పిలుపు

ఈ రూ.330 కోట్ల కుంభకోణంలో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లో జరిగింది. కాంట్రాక్టు విలువ రూ.284 కోట్ల పైచిలుకు కాగా, అందులోంచి అప్పనంగా రూ.114 కోట్లు కొట్టేశారు" అని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఓ ఫ్లో చార్ట్ సాయంతో డబ్బు ఎట్నుంచి ఎటు వెళ్లిందన్నది వెల్లడించే ప్రయత్నం చేశారు. ఏపీఎస్ఎఫ్ఎల్ (ఏపీస్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్) నుంచి రూ.254 కోట్లు టెరాసాఫ్ట్ సంస్థకు వెళ్లాయని, ఇందులో రూ.117 కోట్లను ఫాస్ట్ లేన్ అనే సంస్థకు ఇచ్చారని ఆరోపించారు. అలాగని ఫాస్ట్ లేన్ సంస్థకు ఎలాంటి అనుభవం లేదని, ఈ బిడ్డింగ్ ప్రక్రియ జరిగింది ఆగస్టులో అయితే, ఫాస్ట్ లేన్ సంస్థ 2015 సెప్టెంబరులో ప్రారంభమైందని వెల్లడించారు.

చంద్రబాబు అరెస్ట్‌పై కొడాలి నాని సెటైర్ల వీడియో ఇదిగో, కొట్టండి, జైల్లో పెట్టండి, నిరూపించండి అన్న లోకేష్‌ ఎక్కడ

నెటాప్స్, ఇంగ్రామ్, ఆల్టాయిస్, ఎక్స్ వై జడ్ ఇన్నోవేషన్స్, కాఫీ మీడియా తదితర షెల్ కంపెనీలు కూడా ఈ వ్యవహారంలో ఉన్నాయని, వీటిద్వారా డబ్బును బదిలీ చేయించుకున్నారని తెలిపారు. చంద్రబాబు డబ్బులు కొట్టేశారన్నదానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని మంత్రి అమర్నాథ్ ఉద్ఘాటించారు.