AP Volunteer System: వలంటీర్‌ వ్యవస్థలో మార్పులు, శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు, కొంతమందితోనే వలంటీర్ సిస్టమ్, చంద్రబాబు కీలక నిర్ణయం?

ఏపీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో వలంటీర్ల సేవలను వాడుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం వలంటీర్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని టీడీపీ అధినేత ఆలోచిస్తున్నారు.

ap-cm-chandrababu-naidu-government-to-continue-village-volunteer-system(X)

Vij, Aug 4:  ఏపీలో వలంటీర్ వ్యవస్థపై క్లారిటీ వచ్చేసింది. ఏపీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో వలంటీర్ల సేవలను వాడుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం వలంటీర్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని టీడీపీ అధినేత ఆలోచిస్తున్నారు.

ఇందుకోసం వలంటీర్‌లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. వలంటీర్లలో ఎవరెవరు ఎంత చదువుకున్నారు?, ఎవరికి ఏ పనిలో నైపుణ్యం ఉందో ఆరా తీస్తున్నారు. వలంటీర్‌ పోస్టుకి విద్యార్హతగా పదో తరగతి నిర్ణయించినా…. చాలా మంది డిగ్రీ, పీజీ చేసిన వారున్నారు. కొంతమంది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నారు.

వీరి విద్యార్హత, నైపుణ్యం ఆధారంగా శిక్షణ ఇప్పించి ప్రైవేటు, కార్పొరేట్‌ సెక్టార్‌లో ఉద్యోగాలు కల్పించాలని భావిస్తోంది ప్రభుత్వం. ముందుగా వలంటీర్ల విద్యార్హతలపై డేటా సేకరించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఏపీలో లక్షా 60 వేల మంది వలంటీర్లు ఉన్నారు. వీరిలో కొంతమందికి ప్రత్యామ్నాయం చూపించి మిగితా వారిని వలంటీర్లుగా కొనసాగించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, ఎస్సీ శాఖ కమిషనర్‌గా శ్రీదేవి, అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి

ఇప్పటివరకు ప్రతి 50 కుటుంబాలు(ఇళ్ల)కు వలంటీర్లు సేవలు అందిస్తుండగా వీరి పరిధిని మరింత పెంచాలని భావిస్తున్నారు. అంతేగాకుండా మరిన్ని విధులను అప్పగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. చిరుద్యోగుల పొట్ట గొట్టాలనే ఉద్దేశం తమకు లేదనే సంకేతాలు చంద్రబాబు ఇవ్వాలని భావిస్తున్నారు. మొత్తంగా వలంటీర్ వ్యవస్థపై ఓ నిర్ణయానికి చంద్రబాబు రావడంతో వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.



సంబంధిత వార్తలు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, మొత్తం 21 బిల్లులు ఆమోదం, 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు