Telangana government transfers 8 IAS officers(X)

Hyd, Aug 3: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వేళ తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషషనర్‌గా టీకే శ్రీదేవి ,వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. రవాణా, ఆర్అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్‌,రవాణా, ఆర్‌అండ్‌బీ సంయుక్త కార్యదర్శిగా ఎస్‌.హరీశ్‌,మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్‌కుమార్‌లకు అదనపు బాధ్యతలు అప్పగించారు .

పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా ప్రియాంక,హాకా ఎండీగా చంద్రశేఖర్‌రెడ్డి,మార్క్‌ఫెడ్‌ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డిలను బదిలీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 12 రోజుల పాటు అమెరికా వెళ్లనున్న నేపథ్యంలో బదిలీలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర కీలక అంశాలపై చర్చించారు.స్కిల్ వర్సిటీలో బోధించే ఆటోమోటివ్ డిపార్ట్‌మెంట్‌ ను దత్తత తీసుకోవడానికి ఆనంద్ మహీంద్ర అంగీకరించారు. సీఎం రేవంత్‌కి ఆగస్టు గండం?, రేవంత్ అమెరికాకు వెళ్లొచ్చేలోపు సీఎం పదవి పోతుంతా, బీఆర్ఎస్ నేతల ధీమా ఏంటీ?

ఇక అమెరికా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్‌ డీసీ, శాన్‌ఫ్రాన్సిస్‌కో, దక్షిణ కొరియాలోని సియోల్ తదితర ప్రాంతాల్లో పర్యటించనుంది. ఎనిమిదిరోజులు అమెరికాలో , ఆ తర్వాత మరో రెండు రోజులు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. అమెరికాలోని ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు సీఎం రేవంత్. ఇక రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.