Telangana Congress..Is Telangana CM Revanth Reddy faces August Month Crisis(X)

Hyd, Aug 3: ఆగస్టు సంక్షోభం..ఈ పేరు వింటేనే గుర్తకొచ్చేది టీడీపీ. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ ఇబ్బందులు ఎదుర్కొన్న నెల ఆగస్టు. చాలా సంఘటనలు ఆగస్టులోనే రావడంతో ఆ పార్టీ నేతలకు ఆగస్టు అంటేనే వణికిపోతారు. ఎందుకంటే ఎన్టీఆర్‌ సీఎంగా ఉండగా, రెండు సార్లు ఆగస్టు నెలలోనే పదవీ గండం ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే ఆగస్టు సంక్షోభం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఉందా, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంతా?,రేవంత్‌కు సర్కార్ పడిపోవడం గాసిపేనా చూడాలి.

వాస్తవానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. మేజిక్ ఫిగర్‌కు కేవలం 4 స్థానాలే 65(ఎమ్మెల్యేలు) మాత్రమే ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఇదే అంశాన్ని పలుమార్లు ప్రస్తావించారు కూడా. కాంగ్రెస్‌లోని కొంతమంది తమను సంప్రదిస్తున్నారని, 20 మంది ఎమ్మెల్యేలతో వస్తాం ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని చెబుతున్నారని సంచలన కామెంట్స్ చేశారు.

ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే అంశం ప్రధాన ఎజెండాగా సాగింది. ఆ తర్వాత దీనికి కొనసాగింపుగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆగస్టు పై చర్చకు దారితీశాయి. సీఎం రేతంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళుతుండగా, రాష్ట్రంలో పాలన వ్యవహారాలను తాను చూసుకుంటానని మంత్రి కోమటిరెడ్డి ప్రచారం చేయడంతో ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకూరింది. సీఎం అమెరికాలో ఉండగా నల్లగొండ, ఖమ్మం మంత్రులు ఆయన కుర్చీ లాగేస్తారని కౌశిక్‌రెడ్డి కామెంట్స్ చేశారు.  తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకటన, పూర్తి వివరాలివే, చివరి రోజు కీలక బిల్లులకు అమోదం,అసెంబ్లీలో బూతులు మాట్లాడిన దానం నాగేందర్ 

వాస్తవానికి తెలంగాణకు పెట్టుబడులో కోసం ఆగస్టులో 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు శ్రీకారం చుట్టారు. రేవంత్‌తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు అమెరికా వెళ్లనున్నారు. అయితే డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క తెలంగాణలో పాలన వ్యవహారాలను చూడాల్సి ఉంది. కానీ కోమటిరెడ్డి తానే పాలన వ్యవహారాలను చూస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే బేస్ చేసుకుని కౌశిక్ రెడ్డి..సీఎం అమెరికా నుండి వచ్చే లోపు ఆయన పదవి పోవడం ఖాయమని చెప్పారు. అయితే రేవంత్‌కు పదవి గండం ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఆగస్టు సంక్షోభం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.