Dharmavaram Murder Case: స్నేహలత కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. 10 లక్షల సాయం, తక్షణ సాయంగా రూ.4,12,500 లు, వివరాలను వెల్లడించిన భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ, కలెక్టర్ గంధం చంద్రుడు
ఏపీలో అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద ప్రేమికుడి చేతిలో హత్యకు (Dharmavaram Murder Case) గురైన స్నేహలత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.
Dharmavaram, Dec 25: ఏపీలో అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద ప్రేమికుడి చేతిలో హత్యకు (Dharmavaram Murder Case) గురైన స్నేహలత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.
పోయిన ప్రాణాన్నీ తీసుకురాలేమని. ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) స్పందించి ఆమె కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని గురువారం చెప్పారు. దళిత వర్గానికి చెందిన మహిళలపై అత్యాచార (Rape cases) ఘటనల్లో చట్టపరంగా రూ.8.25 లక్షల పరిహారం అందజేస్తారు. దీనికి సీఎం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అదనమని మంత్రి తెలిపారు.
త్వరితగతిన కేసును దర్యాప్తు చేయాలని పోలీసుశాఖను సీఎం ఆదేశించారని ఆయన చెప్పారు. స్నేహలత కుటుంబానికి చట్టప్రకారం వచ్చే రూ.8.25 లక్షల్లో తక్షణసాయంగా రూ.4,12,500 అందజేస్తున్నామన్నారు. స్నేహలత కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇంటి స్థలం, ఇల్లు, ఐదెకరాల పొలం ఇస్తామని చెప్పారు. ఆ కుటుంబానికి మూడు నెలలకు సరిపడా వందకిలోల బియ్యం, పదిలీటర్ల వంటనూనె, పదికిలోల చక్కెర, ఇతర నిత్యావసర సరుకులు, వంటపాత్రలు అందించినట్లు తెలిపారు.
స్నేహలత హత్యపై పూర్తిస్థాయిలో న్యాయ విచారణ జరిపించి నిందితులకు కఠినశిక్షలు పడేలా చూస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. గురువారం ఆమె అనంతపురంలో స్నేహలత కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఈ హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రియుడు గుత్తి రాజేష్, కార్తీక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 302,201 కింద కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ బి.సత్యయేసు గురువారం సాయంత్రం మీడియాకు తెలిపారు. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు.
గత నాలుగేళ్లుగా స్నేహలత-రాజేశ్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలిపారు. ఇతర వ్యక్తులతో సంబంధాలున్నాయని రాజేశ్ వేధించాడని, ఈ క్రమంలో రాజేష్ మంగళవారం స్నేహలతను తన బైక్ మీద ధర్మవరం నుంచి అనంతపురానికి తీసుకొచ్చేందుకు వెళ్లాడని చెప్పారు.
బడన్నపల్లి సమీపంలోకి వచ్చే సరికి రోడ్డు పక్కన బైక్ ఆపి ఆమెతో గొడవపడి.. గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న బ్యాంకు పేపర్లను శరీరంపై వేసి కాల్చి పరారయ్యాడయాని అనంతరం తల్లిదండ్రులు ఫిర్యాదుతో అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. నిందితులపై త్వరగా ఛార్జ్‌షీట్ వేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు.