CM Jagan Mohan Reddy Delhi Tour: ఢిల్లీకి చేరిన ఏపీ రాజకీయాలు, హస్తిన బాటపట్టనున్న వైయస్ జగన్, చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆసక్తికరంగా మారనున్న టూర్
ఈ పర్యటనలో సీఎం జగన్ కేంద్ర పెద్దలతో భేటీ కానున్నారని అంటున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన సీఎం వచ్చీరాగానే ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంపై రాజకీయంగా రకరకాల చర్చ జరుగుతోంది.
Vijayawada, SEP 13: లండన్ పర్యటన ముగించుకుని ఏపీకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) వెను వెంటనే ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. చంద్రబాబు అరెస్ట్, 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో సీఎం ఢిల్లీ (Jagan Delhi Tour) పర్యటన ఆసక్తి పెంచుతోంది. అకస్మాత్తుగా సీఎం జగన్ హస్తిన యాత్ర వెనుకున్న ఉద్దేశం ఏంటి? రాజకీయ అంశాలు ఏవైనా ఉన్నాయా? లేక పరిపాలనాపరమైన పనుల మీదే కేంద్ర పెద్దలను కలుస్తున్నారా? అన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. ఇంతకీ ఏపీ రాజకీయాల్లో తెరచాటున ఏం జరుగుతోంది? లండన్ పర్యటన నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చిన సీఎం జగన్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ పర్యటనలో సీఎం జగన్ కేంద్ర పెద్దలతో భేటీ కానున్నారని అంటున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన సీఎం వచ్చీరాగానే ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంపై రాజకీయంగా రకరకాల చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా సీఎం జగన్ లండన్ లో ఉండగానే ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అయ్యారు. దీంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ మంటలు అలా కొనసాగుతూ ఉండగానే సీఎం జగన్ హస్తినకు వెళ్లనుండటం ఆసక్తికరంగా మారింది. సీఎం జగనే స్వయంగా ఢిల్లీ వెళ్తున్నారు? కేంద్రం పెద్దలు పిలిచారా? అన్నదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.