Andhra Pradesh: ఎండాకాలంలో కరెంటు కోతలు అనే మాట వినపడకూడదు, అన్ని రకాలుగా సిద్ధం కావాలని అధికారులకు సీఎం జగన్ సూచన, ఇంధనశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి

వేసవిలో విద్యుత్‌ కొరత అనేది ఉండకూడదని ఏపీ ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. విద్యుత్‌ కొరత కారణంగా కరెంటు కోతలు అనే సమస్య ఉత్పన్నం కాకూడదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సూచించారు.

CM-YS-jagan-Review-Meeting

Amaravati, Feb 24: ఇంధనశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు.వేసవిలో విద్యుత్‌ కొరత అనేది ఉండకూడదని ఏపీ ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. విద్యుత్‌ కొరత కారణంగా కరెంటు కోతలు అనే సమస్య ఉత్పన్నం కాకూడదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సూచించారు.

జూనియర్ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావాలి, పాదయాత్రలో నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు, 2014లోనే తాను పవన్ కల్యాణ్‌లో మంచి మనసును చూశానని వెల్లడి

ఈ సమీక్షా సమావేశానికి విద్యుత్‌, అటవీ పర్యావరణం, మైన్స్‌ అండ్‌ జియాలజీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్‌. గుల్జార్‌, ట్రాన్స్‌కో జేఎండీ పృధ్వీతేజ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సమీక్ష సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే.. 

బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి:

థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరతరాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలి:

రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్లపై కీలక నిర్ణయం.

ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరుచేయాలన్న సీఎం ఆదేశాలను అమలు చేస్తామన్న అధికారులు.

రైతులకు కనెన్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టంచేసిన సీఎం.

ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామన్న అధికారులు.

మార్చి నాటికి మరో 20వేల కనెక్షన్లుపైగా మంజూరు చేస్తున్నట్టు వెల్లడి.

విద్యుత్‌ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామని తెలిపిన అధికారులు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 100 విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతున్నట్టు వెల్లడించిన అధికారులు.

వివేకానందరెడ్డి హత్య కేసు, ముగిసిన అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ, తనకు తెలిసిన వాస్తవాలే సీబీఐకి చెప్పానని తెలిపిన కడప ఎంపీ

మార్చి నెలాఖరు నాటికి వీటిని పూర్తిచేస్తున్నామన్న అధికారులు.

అలాగే పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తిచేసుకుంటున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేస్తున్నామని వెల్లడి.

ఇప్పటికే 2.18లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించిన అధికారులు.

ఇళ్లు పూర్తవుతున్నకొద్దీ.. వాటికి కనెక్షన్లు శరవేగంగా ఇస్తున్నామని వెల్లడి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement