Distribution of House Rails: వైఎస్సార్ పుట్టిన రోజున ఏపీ సీఎం భారీ గిఫ్ట్, పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ, ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు
జూలై 8న దివంగత సిఎం వైఎస్ఆర్ జయంతి (YS Rajasekhara Reddy Birthday) రోజున పేదలకు ఇళ్ల పట్టాలను (Distribution of House Rails) ఇవ్వాలని నిర్ణయించారు. 29-30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని.. ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం అని జగన్ అన్నారు. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధి మీద నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను సూచించారు.
Amaravati, June 24: ఏపి సిఎం వైయస్ జగన్ మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ‘స్పందన’ కార్యక్రమంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో (AP CM Video Conference) మాట్లాడారు. జూలై 8న దివంగత సిఎం వైఎస్ఆర్ జయంతి (YS Rajasekhara Reddy Birthday) రోజున పేదలకు ఇళ్ల పట్టాలను (Distribution of House Rails) ఇవ్వాలని నిర్ణయించారు. 29-30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని.. ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం అని జగన్ అన్నారు. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధి మీద నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను సూచించారు. రూ.15 వేలు నేరుగా అకౌంట్లోకి, వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని లాంచ్ చేయనున్న ఏపీ సీఎం, 2,35,873 మంది బ్యాంకు ఖాతాలకు రూ.354 కోట్లు జమ
నూటికి నూరు శాతం ఇళ్లపట్టాలు పంపిణీ కావాలని జగన్ (AP CM YS Jagan) స్పష్టం చేశారు. ప్లాట్ల కేటాయింపు కోసం (Distribute house sites) లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలని అన్నారు. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల తుది జాబితా గ్రామ సచివాలయాల్లో పెట్టాలని ఆదేశించారు. వైఎస్‌ఆర్‌సిపికి ఓటు వేయని వారికి కూడా ఇండ్ల పట్టాలు అందించాగలని జగన్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాల వారిగా ఇండ్ల పట్టాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో మరో 12 కొత్త జిల్లాలు! జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సులో కొత్త జిల్లాల అంశాన్ని ప్రస్తావించిన ఏపీ సీఎం, ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన
పారదర్శకంగా, ప్రభావవంతంగా ఇళ్లపట్టాలను పంపిణీ చేయాలని ఏపీ సీఎం పేర్కొన్నారు. సరైన కారణంగా లేకుండా ఎవరికైనా ఇంటి పట్టా రాలేదంటే అధికారులను బాధ్యులను చేస్తామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటిపట్టా ఇవ్వాలన్నారు. తనకు ఓటు వేయని వారికి కూడా ఇళ్లపట్టా ఇవ్వాలని సీఎం తెలిపారు. పెన్షన్ కార్డుకు 10 రోజులు, రేషన్ కార్డుకు 10 రోజులు, ఆరోగ్యశ్రీ కార్డు 20 రోజులు, ఇంటి పట్టా 90 రోజుల్లో గ్రామ సచివాలయాల ద్వారా అందాలన్నారు. ఈ గడువులోగా అందించేలా వ్యవస్థలను తయారుచేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. వివక్ష లేకుండా, సంతృప్తస్థాయిలో అందాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
అలాగే పచ్చదనం పెంపునకు ‘జగనన్న పచ్చతోరణం’ కింద 6 కోట్ల మొక్కల నాటాలని లక్ష్యమని సీఎం తెలిపారు. నాడు నేడు కింద, ఖాళీ స్థలాల్లో, ఇంటర్నల్ రోడ్లు, అప్రోచ్ రోడ్లు తదితర ప్రాంతాల్లో మొక్కల నాటే కార్యక్రమం, అలాగే ఇళ్లపట్టాలు ఇవ్వనున్న లే అవుట్స్‌లో కూడా బాగా మొక్కలు నాటాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఇళ్లపట్టా లబ్ధిదారునికీ నాలుగు మొక్కులు ఇవ్వాలని సీఎం సూచించారు.
పట్టణ ప్రాంతాల్లో వార్డు క్లినిక్స్, వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ పేరిట నిర్మాణం చేపట్టాలన్నారు. 2 కి.మీ పరిధిలో, కనీసం 15 నిమిషాల వ్యవధిలో నడుచుకుంటూ వెళ్లేదూరంలో వార్డు క్లినిక్స్ నిర్మాణం చేయాలని దీనికోసం స్థలాలను గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు.