Bhumana Karunakar Reddy: ఎమ్మెల్యే భూమనకు ఏపీ సీఎం ఫోన్, రెండవసారి కరోనా సోకిన నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి
శనివారం ఉదయం ఫోన్ చేసి ఎమ్మెల్యే ( MLA Bhumana Karunakar Reddy) ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూమనకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు.
Amaravati, Oct 10: రెండవసారి కరోనా సోకి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందతున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) పరామర్శించారు. శనివారం ఉదయం ఫోన్ చేసి ఎమ్మెల్యే ( MLA Bhumana Karunakar Reddy) ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూమనకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు.
రెండవసారి కరోనా సోకిన నేపథ్యంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ.. మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి బుధవారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ రిపోర్టు (He was infected with the corona for the second time) వచ్చిన సంగతి తెలిసిందే.ఆయనకు బీపీ, షుగర్ నార్మల్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇక ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హైదరాబాదులో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయనతో పాటు మరో నలుగురు కార్యాలయ సిబ్బందికి పాజిటివ్ అని తేలింది. గత వారం రోజుల్లో తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఎంపీ కోటగిరి శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.