CM Jagan writes to PM Modi: 2022 కల్లా పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై పథకం పూర్తి, నిధులు విడుదల చేయాలని ప్రధానికి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఇప్పటికే రూ.23,535 కోట్లు ఖర్చు చేశామని లేఖలో తెలిపిన సీఎం
దీనికోసం ఆర్థిక సాయం చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న అందరికీ ఇళ్లు కార్యక్రమంపై మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ (CM Jagan writes to PM Modi) రాశారు.
Amaravati, June 8: పీఎంఏవై కింద గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని ఏపీ సీఎం జగన్ కోరారు. దీనికోసం ఆర్థిక సాయం చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న అందరికీ ఇళ్లు కార్యక్రమంపై మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ (CM Jagan writes to PM Modi) రాశారు. పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకం సుస్థిరాభివృద్ధికి దోహదం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohanr Reddy) ఈ లేఖలో తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 17వేల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.34,104 కోట్లు ఖర్చవుతాయని.. ఇప్పటికే ఇళ్లపట్టాలు, నిర్మాణాలకు రూ.23,535 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఆయా కాలనీల్లో మౌలిక సదుపాయాలు (infrastructure development) కల్పించకపోతే ప్రయోజనముండదని.. పెద్దమొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం సాధ్యపడట్లేదని తెలిపారు. పీఎంఏవై కింద అందుతున్న నిధులు అవసరాలను తీర్చలేకపోతున్నాయన్నారు. ఆ పథకం కింద రాష్ట్రాలకు సమృద్ధిగా నిధులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రధానిని (PM Narendra Modi) జగన్ కోరారు. మౌలిక వసతులకు నిధులిచ్చేలా సంబంధిత శాఖను ఆదేశించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
Here's AP CM Letter
2022 కల్లా ‘పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకం (Pradhan Mantri Awas Yojana (PMAY) పూర్తి చేయాలన్న ప్రధాని మోదీ సంకల్పం చాలా గొప్పదని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘‘ఏపీ ప్రభుత్వం 68,381 ఎకరాల భూమిని పేదలకు పంచింది.17,005 గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈ కాలనీల్లో 28.35 లక్షల పక్కాఇళ్లను నిర్మించేందుకు సంకల్పించామని తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.50,944 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం.
పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవైలో భాగంగా మౌలిక వసతులు కల్పించాలి. ఇందుకోసం ఇంకా రూ.34,104 కోట్ల నిధులు అవసరమవుతాయి. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాల కోసం ఇప్పటికే రూ.23,535 కోట్లు ఖర్చు చేశాం. ఇంత మొత్తం వెచ్చించడం రాష్ట్రానికి భారం అవుతుంది. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రానికి అండగా ఉండాలి’ అని సీఎం వైఎస్ జగన్ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలకు పీఎంఏవై కింద ఏపీకి సమృద్దిగా నిధులు వచ్చేలా ఆదేశించాలని సీఎం వైఎస్ జగన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు