AP CM Video Conference: కలెక్టర్లు,ఎస్పీలతో ఏపీ సీఎం వీడియో కాన్ఫరెన్స్, మద్యపాన నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి

మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికే లిక్కర్‌ ధరలను భారీగా పెంచినట్టు ఆయన వెల్లడించారు. అక్రమ మద్యం రవాణాకు గట్టి చర్యలు చేపడతామని తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలతో (Collectors, SP's) మంగళవారం సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ (AP CM Video Conference) నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యపాన నిషేధానికి తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.

AP CM YS Jagan Video Conference with Collectors and SPs over Alcohol price hike and ban (Photo-Twitter)

Amaravati, May 5: ఏపీలో దశల వారీగా మద్యపాన నిషేధానికి (liquor ban in AP) తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ( AP CM YS Jagan Mohan Reddy) స్పష్టం చేశారు. మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికే లిక్కర్‌ ధరలను భారీగా పెంచినట్టు ఆయన వెల్లడించారు. మందు బాబులకు జగన్ సర్కారు ఝలక్, మద్యం ధరలు మరోసారి పెంపు, మద్యం నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు

అక్రమ మద్యం రవాణాకు గట్టి చర్యలు చేపడతామని తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలతో (Collectors, SP's) మంగళవారం సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ (AP CM Video Conference) నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యపాన నిషేధానికి తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.

మనం 25 శాతం పెంచి తగ్గించాలనుకుంటే.. ఢిల్లీలో 70 శాతం పెంచారు. అందుకే 75 శాతం పెంచి.. గట్టి చర్యలు తీసుకున్నాం. మద్యం దుకాణాల సంఖ్యను మరో 13 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే 20 శాతం తగ్గించామ అన్నారు. ప్రతి షాపు వద్ద ఇంతకుముందు ప్రైవేటు రూమ్స్‌ పెట్టారు.అధికారంలోకి వచ్చాక దీన్ని రద్దుచేశాం. ఏపీకి తుఫాను ముప్పు, వాయుగుండంగా మారుతోన్న అల్పపీడనం, ఎంఫాన్‌‌ తుఫాన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు ఏపీ సీఎం ఆదేశాలు

వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 43 వేల బెల్టు షాపులను రద్దు చేశాం. గ్రామాల్లో బెల్టు షాపులు శాశ్వతంగా లేకుండా చేయాలంటే... లాభాపేక్ష లేనప్పుడే జరుగుతుంది. అందుకనే ప్రైవేటు వారికి కాకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుంది. లేకపోతే సేల్స్‌ను పెంచుకోవడం కోసం ప్రైవేటు వాళ్లు బెల్టు షాపులను ప్రోత్సహిస్తారని ఏపీ సీఎం అన్నారు.

మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యం విక్రయించే వేళలలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటవరకూ పరిమితం చేశామని అందులో భాగంగానే ఈ 75 శాతం పెంపు నిర్ణయం కూడా తీసుకున్నామని అన్నారు. దీనివల్ల పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా, అలాగే రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీని కూడా అడ్డుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటి బాధ్యత ఎస్పీల మీద ఉంటుంది. దీనికోసం ప్రత్యేక పోలీసు అధికారిని పెట్టామని ఏపీ సీఎం తెలిపారు. కర్నూలులో 516కు చేరిన కరోనా కేసులు, ఏపీలో గడిచిన 24 గంటల్లో 67 కేసులు నమోదు, రాష్ట్రంలో 1717కు చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య

అక్రమ మద్యం రవాణా, మద్యం తయారీ, ఇసుక అక్రమాలు ఎట్టి పరిస్థితులోనూ ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష అనేది ఉండకూడదని కలెక్టర్లకు, ఎస్పీలకు గట్టిగా చెప్తున్నా. ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఈ అంశాలను దగ్గరుండి నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. మీ మీద పూర్తి విశ్వాసం ఉంది. దాన్ని నిలబెట్టుకోవాలని వైఎస్‌ జగన్‌ అన్నారు.