AP COVID-19 Bulletin: కర్నూలులో 516కు చేరిన కరోనా కేసులు, ఏపీలో గడిచిన 24 గంటల్లో 67 కేసులు నమోదు, రాష్ట్రంలో 1717కు చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య
ICMR Study Shows One COVID-19 Patient Can Infect 406 Persons in 30 Days if Lockdown Order Flouted: Health Ministry (Photo Credits: IANS)

Amaravati, May 5: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ (AP Coronavirus) చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇవాళ కొత్తగా 67 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో (AP COVID-19 Bulletin) పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1717కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు 589 మంది డిశ్చార్జ్‌ కాగా 1094 మందికి చికిత్స కొనసాగుతున్నది. ఇప్పటి వరకు మొత్తం 34 మంది మృతి చెందారు. మందు బాబులకు జగన్ సర్కారు ఝలక్, మద్యం ధరలు మరోసారి పెంపు, మద్యం నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు

గడిచిన 24 గంటల్లో అనంతపూర్‌లో రెండు, గుంటూరులో 13, కడపలో 2, కృష్ణాలో 8, కర్నూల్‌లో 25, విశాఖపట్టణంలో రెండు, నెల్లూరులో ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. మిగతా 14 మంది గుజరాత్‌కు చెందిన వారని ఏపీ వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.ఇప్పటి వరకూ నమోదైన కేసులతో కర్నూలులో మొత్తం కేసుల సంఖ్క 516కు చేరుకుంది. గుంటూరు-351, కృష్ణా- 286, నెల్లూరు-92, కడప-89, చిత్తూరు- 82, అనంతపురం-80, ప్రకాశం-61, పశ్చిమ గోదావరి జిల్లా 59, తూర్పు గోదావరి 45, విశాఖపట్నం 37, శ్రీకాకుళంలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి.

Here's AP COVID-19 Bulletin

గడిచిన 24 గంటల్లో 65 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వీరిలో కర్నూలు జిల్లాలో 28, గుంటూరు జిల్లాలో 13, కృష్ణా జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, వైఎస్సార్‌ జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు ఉన్నారు.