CM YS Jagan VC With Collectors: కరోనా పరీక్షలు తప్పనిసరిగా జరగాలి, కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్ స్పందన వీడియో ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలపై సమీక్ష
నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. మంగళవారం సీఎం తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు,ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ (CM YS Jagan VC With Collectors) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. కోవిడ్ నివారణ చర్యలు, స్కూళ్లు, అంగన్‌వాడీ, ఆస్పత్రుల్లో నాడు-నేడు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, గిరిజన ప్రాంతాల్లో ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలపై సీఎం జగన్ ( YS Jagan Mohan Reddy) సమీక్ష నిర్వహించారు.
Amaravati, Sep 8: రాష్ట్రంలో కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దని.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. మంగళవారం సీఎం తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు,ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ (CM YS Jagan VC With Collectors) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. కోవిడ్ నివారణ చర్యలు, స్కూళ్లు, అంగన్‌వాడీ, ఆస్పత్రుల్లో నాడు-నేడు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, గిరిజన ప్రాంతాల్లో ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలపై సీఎం జగన్ ( YS Jagan Mohan Reddy) సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితులున్నాయని.. ఈ నేపథ్యంలో ఉదాసీనత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని (Coronavirus Control measures) అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్–19 పరీక్షలు తప్పనిసరిగా జరగాలని, పీహెచ్‌సీలు, యుహెచ్‌పీలు, ఏరియా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రలు, జీజీహెచ్‌లలో పరీక్షల నిర్వహణ తప్పనిసరి ఉండాలన్నారు.
కోవిడ్ పరీక్షల కోసం ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. రాష్ట్రంలో ఎవరికీ రాకూడదు. కోవిడ్ పరీక్షలు, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, ఆసుపత్రుల్లో అడ్మిషన్లు తదితర అన్ని అవసరాలకు 104 కాల్ సెంటర్‌ను ఉపయోగించుకోవాలి. ఈ నంబర్‌ను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. ఈ కాల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లకు రిక్వెస్ట్‌లు వస్తే వెంటనే దానిపై స్పందించాలి. ఆ ఫోన్ కాల్స్‌పై ఎలా రెస్పాండ్ అవుతున్నామనేదే పని తీరుకు అద్దం పడుతుంది. కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన వ్యక్తి పట్ల మనం ఎలా రెస్పాండ్ అవుతున్నామో జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలి. జిల్లా కలెక్టర్లు, జేసీలు ప్రతి రోజూ 104 కాల్ సెంటర్లకు, జిల్లా కోవిడ్ సెంటర్లకు మాక్ కాల్స్ చేసి, వ్యవస్థలో ఎక్కడైనా ఉదాసీనత వుందా లేదా అనే దానిని పరీక్షించాలని సీఎం పేర్కొన్నారు.
ఆర్‌టీపీసీఆర్, ట్రూనాట్ పరీక్షల్లో నమూనాలు తీసుకున్న 24 గంటలు, రాపిడ్ పరీక్షలో 30 నిమిషాల్లో ఫలితం అందించే విధంగా జిల్లా కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు. జిల్లాల్లోని అన్ని ల్యాబ్‌లకు అవసరమైన పరికరాలను అందించామని, ఎక్కడా కిట్లు లేవనే పేరుతో పరీక్షలు నిరాకరించకూడదని సీఎం స్పష్టం చేశారు. పాజిటివ్ కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లు వున్న వారిని కచ్చితంగా హోం క్వారంటైన్‌లో వుంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
‘‘కోవిడ్ నేపథ్యంలో అదనంగా 17 వేల మంది వైద్యులు, ఇతర సిబ్బందిని ఆరు నెలల కాలానికి కాంట్రాక్ట్ విధానంలో నియమించేందుకు అనుమతి ఇచ్చాం. మరో 11 వేల మంది ట్రైనీ నర్స్‌లను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి సంబంధించి ఇంకా కొన్నిచోట్ల నియామకాలు పూర్తి కాలేదు, వాటిని వెంటనే పూర్తి చేయాలి. మరో వారం రోజుల్లో రెగ్యులర్ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలి. నియామకం పొందిన అభ్యర్ధులు వెంటనే వారికి నిర్ధేశించిన కోవిడ్ విధుల్లో చేరాలి. దానిని కూడా కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.