Amaravati, Sep 8: ఏపీలో మద్యం నిషేధం దిశగా అడుగులు పడుతున్నాయా.. తాజా గణాంకాలు ఇది నిజమనే చెబుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మద్యం వినియోగం (Liquor Consumption in AP) గణనీయంగా పడిపోయింది. దీంతో ప్రభుత్వ ఆదాయం కూడా భారీగానే తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మద్యాన్నితమ ఆదాయ వనరుగా చూడటం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మద్య వినియోగంలో 65 శాతం తగ్గుదల (Alcohol consumption decreased) ఉండగా, బీరు వినియోగంలో అయితే ఏకంగా 91.76 శాతం తగ్గుదల నమోదైంది. ప్రభుత్వ ఆదాయం 28.411 శాతం (Government revenue also fell sharply) తగ్గింది. గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు అమ్మకాల్ని ఈ ఏడాదితో పోలిస్తే భారీ వ్యత్యాసం ఉంది.
అమ్మకాల విలువలో 32.48 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. గతేడాది ఏప్రిల్–ఆగస్టు అమ్మకాలను, వినియోగాన్ని పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే మద్యం అమ్మకాలు భారీగా పడిపోయాయి. తెలంగాణలో గతేడాది ఐదు నెలలతో (ఏప్రిల్–ఆగస్టు) ఈ ఏడాది పోల్చి చూస్తే కేవలం 0.31 శాతం మాత్రమే మద్యం వినియోగం తగ్గింది. కానీ.. ప్రభుత్వ ఆదాయంలో మాత్రం 2.93 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. అమ్మకాల విలువలో 4.66 శాతంవృద్ధి నమోదైంది.
ఐదు నెలల్లో రూ.2,170 కోట్లు ఆదాయాన్ని ఏపీ ప్రభుత్వం (AP Government) కోల్పోయింది. గతేడాది ఏప్రిల్–ఆగస్టు మధ్య కాలంలో మద్యం ద్వారా రూ.7,638.24 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఈ ఏడాది ఇదే కాలంలో రూ.5,468.17 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. అంటే గతేడాది కంటే రూ.2,170.07 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ఇక మద్యం, బీరు అమ్మకాల విలువ పరిశీలిస్తే ఐదు నెలల (ఏప్రిల్ – ఆగస్టు) వ్యవధిలో గతేడాది రూ.8,884.69 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.5,998.87 కోట్లు మాత్రమే. అమ్మకాల విలువ గతం కంటే రూ.2,885.82 కోట్లు తక్కువగా నమోదైంది. దక్షిణాదిలో అతి చిన్న రాష్ట్రం కేరళలో కంటే మద్యం వినియోగం ఏపీలో తక్కువగా ఉండటం ఆశ్చర్యపరిచే అంశం.
మహిళల కోసం ప్రత్యేకంగా మద్యం షాపులు, కీలక నిర్ణయం తీసుకున్న కమల్ నాథ్ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐఎంఎఫ్ లిక్కర్, ఫారెన్ లిక్కర్, బీర్, వైన్ ధరలను క్రమబద్దీకరిస్తూ మార్పులు చేసింది. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ భేటీ అనంతరం ధరలను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రూ.150 కంటే తక్కువ ధర ఉన్న బ్రాండ్లపై తగ్గించింది. అలాగే 90ఎమ్‌ఎల్ రూ.190 నుంచి రూ.600 వరకు ఉన్న మద్యంపై ధరలను పెంచింది. బీర్లు, రెడీ టు డ్రింక్ ధరలు తగ్గిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.