Bhopal, February 28: అక్కడ ఇక్కడ ప్రత్యేకంగా మహిళల కోసమే వైన్ షాపులు (Alcohol Shops) ఉంటాయి. నేరుగా మహిళలు షాపుకెళ్లి తమకు నచ్చిన మద్యంను ఇకపై కొనుగోలు చేయవచ్చు. ఇది ఎక్కడో కాదు. మన దేశంలోని మధప్రదేశ్ రాష్ట్రంలో.. అవును మీరు విన్నది నిజమే. మద్యం తాగే అలవాటున్న మహిళలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం (Madhya Pradesh Government) శుభవార్తను అందించింది. ఇకపై మద్యం కొనేందుకు మహిళలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో కమల్ నాథ్ సర్కార్ (CM Kamal Nath) కీలక నిర్ణయం తీసుకుంది.
మద్యం కేసుల్లో శిక్ష పడితే నో లైసెన్స్
ఇందులో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా మద్యం షాపులు ఏర్పాటు చేయనుంది. త్వరలో ఉమెన్ ఫ్రెండ్లీ లిక్కర్ షాపులు ('Women-Friendly' Liquor Shops In MP) ఏర్పాటు చేసి మద్యం కొనేందుకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. AP's New Excise Act
ప్రత్యేకంగా లేడీస్ కోసం ఏర్పాటు చేసే ఈ లిక్కర్ షాపుల్లో హై ఎండ్ ఫారిన్ లిక్కర్ బ్రాండ్స్ మాత్రమే అమ్ముతారని తెలుస్తోంది. ముందుగా భోపాల్, ఇండోర్ లో ఎక్స్ క్ల్యూజివ్ గా రెండు లిక్కర్ షాపులు.. జబల్ పూర్, గ్వాలియర్ లో చెరో లిక్కర్ షాప్ ఏర్పాటు చేయనున్నారు.
మద్యం కోసం తహతహలాడి రూ. 51 వేలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్ మహిళ
ఈ లిక్కర్ షాపుల్లో నాణ్యమైన మద్యం మాత్రమే అమ్ముతారు. మద్యం కొనుగోలు చేసే విషయంలో మహిళలకు సౌకర్యవంతంగా ఉండేలా.. మాల్స్ లో ఈ ప్రత్యేక లిక్కర్ షాపులు అధికారులు ఏర్పాటు చేయనున్నారు. కాగా మద్యం అమ్మకాల ద్వారా వీలైనంత ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైన్ ఫెస్టివల్ కూడా కమల్ నాథ్ సర్కార్ నిర్వహిస్తోంది. అంతేకాదు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కొత్తగా 15 వైన్ షాపులు ఓపెన్ చేయనుంది.
ఈ ఏడాది ఎక్సైజ్ శాఖ (Madhya Pradesh Excise Policy 2020) ద్వారా రూ.2వేల కోట్ల ఆదాయం రాబట్టుకోవాలని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యప్రదేశ్ లో 2వేల 544 స్వదేశీ తయారీ లిక్కర్ షాపులు, 1,061 ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ షాపులు ఉన్నాయి. దేశంలో మద్యం ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కర్నాటక ఉంది. 2020 ఏప్రిల్ 1 నుంచి మధ్యప్రదేశ్ లో మద్యం ధరలు 15శాతం పెరగనున్నాయి.