AP CM East Godavari Tour: టీచర్‌ కమ్ స్టూడెంట్‌గా మారిన ఏపీ సీఎం వైయస్ జగన్, గ్రీన్‌ బోర్డుపై ఆల్‌ ద వెరీ బె​స్ట్‌ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి, స్కూల్లో ఉన్న సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి స్వయంగా తెలుసుకున్న సీఎం

అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని గ్రీన్‌ బోర్డుపై ‘ఆల్‌ ద వెరీ బె​స్ట్‌’ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

AM CM YS Jagan (Photo-Video grab)

East Godavari, August 16: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో (AP CM YS Jagan Visits East Godavari) భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి.. అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని గ్రీన్‌ బోర్డుపై ‘ఆల్‌ ద వెరీ బె​స్ట్‌’ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి సీఎం జగన్‌ విద్యార్థులతో మాట్లాడుతూ పాఠ్య పుస్తకాలను పరిశీలించారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులకు అందిస్తున్న పలు సౌకర్యాలను సీఎం జగన్‌కు వివరించారు.

మానసిక స్థితి సరిగా లేని చిన్నారుల తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు తరగతి గదిలో బెంచ్‌పై జగన్‌ కూర్చొన్నారు. అనంతరం పి.గన్నవరం జడ్పీ పాఠశాలలో తరగతి గదులను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం స్కూల్లో ఉన్న సౌకర్యాలు ఎలా ఉన్నాయో స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకొని.. ప్రభుత్వం అందిస్తున్న స్కూల్‌ బ్యాగ్‌ను భుజాన వేసుకొని మరీ సీఎం జగన్‌ పరిశీలించారు.

Here's YSRCP Tweet

విద్యార్థులకు అందించే ఆహారానికి సంబంధించిన ‘మెనూ’ను సీఎం జగన్‌ పరిశీలిచారు. అనంతరం ‘మనబడి నాడు-నేడు’ (manabadi nadu nedu) ద్వారా తొలి విడత పనులు పూర్తైన పాఠశాలలను పైలన్‌ ఆవిష్కరించి సీఎం జగన్‌ ప్రారంభించారు.

తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే విద్యార్థులు స్కూలుకు, ఏపీలో మోగిన బడిగంట, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు, మార్గదర్శకాలు విడుదల చేసిన ఆయా రాష్ట్రాలు

‘మనబడి నాడు-నేడు’ (second phase of Nadu-Nedu scheme) ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించారు. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా వైఎస్‌ జగన్‌ వాటిని విద్యార్థులకు అంకితం చేశారు. అనంతరం రెండో విడత చేపట్టబోయే పాఠశాలల పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న విద్యా కానుక’ రెండో విడత పంపిణీని రూ.731.30 కోట్లతో సీఎం జగన్‌ ప్రారంభించారు.