AP Corona Report: కరోనా నుంచి కోలుకుంటున్న కర్నూలు, ఏపీలో 998 మంది పేషెంట్లు డిశ్చార్జ్, 975 యాక్టివ్ కేసులు, 24 గంటల్లో 74 మంది పేషెంట్లు రికవరీ

గత 24 గంటల్లో కొత్తగా మరో 38 పాజిటివ్ కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19కేసుల సంఖ్య (COVId-19 Cases in AP) సోమవారం ఉదయం నాటికి 2018కు చేరింది. 7,409 సాంపిల్స్ ని పరీక్షిస్తే కేవలం 38 మంది మాత్రమే కోవిడ్19 (COVID-19) పాజిటివ్ గా నిర్దారింపబడ్డారని ప్రభుత్వం (AP Govt) తెలిపింది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య నేడు ఏమీ నమోదు కాలేదు. 45 మంది కరోనా వల్ల మరణించారు. మొత్తం మీద ఇప్పటివరకు 998 మంది డిశ్చార్జ్ కాగా 975 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో 74 మంది పేషెంట్లు రికవరీ అయ్యారు.

Coronavirus Outbreak in India . |(Photo Credits: PTI)

Amaravati, May 11: ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య (AP Corona Report) 2000 దాటింది. గత 24 గంటల్లో కొత్తగా మరో 38 పాజిటివ్ కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19కేసుల సంఖ్య (COVId-19 Cases in AP) సోమవారం ఉదయం నాటికి 2018కు చేరింది. 7,409 సాంపిల్స్ ని పరీక్షిస్తే కేవలం 38 మంది మాత్రమే కోవిడ్19 (COVID-19) పాజిటివ్ గా నిర్దారింపబడ్డారని ప్రభుత్వం (AP Govt) తెలిపింది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య నేడు ఏమీ నమోదు కాలేదు. 45 మంది కరోనా వల్ల మరణించారు. మొత్తం మీద ఇప్పటివరకు 998 మంది డిశ్చార్జ్ కాగా 975 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో 74 మంది పేషెంట్లు రికవరీ అయ్యారు. ఏపీలో షాపుల ఓపెన్‌కు గ్రీన్ సిగ్నల్, ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష

కరోనా కేసులు అధికంగా ఉన్న కర్నూలు (Kurnool) జిల్లాలో కొత్తగా 9 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ కేసుల సంఖ్య 575కు చేరింది. 267 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం అక్కడ 292 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 16 మంది కరోనాతో మరణించారు. ఆదివారం విడుదల అయిన వారిలో 23 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు.

Here's AP Corona Report

ఇందులో కర్నూలు నగర వాసులు 20, ఆత్మకూరు వాసి ఒకరు, నంద్యాల వాసులు ఆరుగురు, కోడుమూరుకు చెందిన ఒకరు ఉన్నారు. వీరిలో 60 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఇద్దరు, 40 నుంచి 60 ఏళ్ల మధ్యలో 12 మంది, 20 నుంచి 40 ఏళ్ల మధ్యలో 14 మంది కరోనాను జయించారు. వీరికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఒక్కొక్కరికి రూ.2 వేల నగదు అందించి ప్రత్యేక అంబులెన్స్‌లో ఇంటికి పంపించారు.  ఆర్థిక పరిస్థితి సంగతేంటి, రాష్ట్రాల సీఎంలతో 3 గంటలకు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్, లాక్‌డౌన్‌ ఎత్తివేత, ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం వంటి అంశాలే ప్రధాన ఎజెండా

కోవిడ్‌–19 నివారణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తోందని ఆదివారం కేంద్ర బృందం సభ్యులు కితాబిచ్చారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఎక్కువ మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి, వైరస్‌ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపడుతోందని ప్రశంసించారు. కర్నూలు జిల్లాతో పాటు గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు కేంద్ర బృందం పర్యటిస్తోంది.

కర్నూలు బృందంలో ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ పబ్లిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మధుమిత దూబే, ప్రొఫెసర్‌ సంజయ్‌కుమార్‌ సాధూఖాన్‌ ఉండగా, గుంటూరు బృందంలో డాక్టర్‌ బాబీపాల్, డాక్టర్‌ నందినీ భట్టాచార్య ఉన్నారు. కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ నేతృత్వంలో జిల్లా నోడల్‌ అధికారులతో సమావేశమయ్యారు.