AP CM YS Jagan (Photo-Twitter)

Amaravati, May 11: ఏపీలో లాక్‌డౌన్ తర్వాత కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలను తెరిచేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది. కోవిడ్‌–19 నియంత్రణ చర్యలు (coronavirus prevention), లాక్‌డౌన్‌ (AP Lockdown) అనంతరం రాష్ట్రాల మధ్య రాకపోకలపై అనుసరించాల్సిన విధానాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ఆదివారం తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితి సంగతేంటి, రాష్ట్రాల సీఎంలతో 3 గంటలకు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్, లాక్‌డౌన్‌ ఎత్తివేత, ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం వంటి అంశాలే ప్రధాన ఎజెండా

కరోనాపై ప్రజల్లో భయాన్ని పోగొడుతూ భౌతిక దూరం లాంటి జాగ్రత్తలపై అవగాహన కల్పించడం ద్వారా వైరస్‌తో సమర్థంగా పోరాడగలమని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో కోవిడ్‌ తాజా పరిస్థితి, వలస కార్మికులపై చర్చలు జరిగాయి. విదేశాల నుంచి వచ్చే వారిని విమానాశ్రయాల నుంచి క్వారంటైన్‌ కేంద్రాలకు చేరుకునేందుకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలని సీఎం సూచించారు. సీఎం ఆదేశాల ప్రకారం వీరికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉచితంగానే అన్ని వసతులు కల్పించేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.  కరోనాతో 2206 మంది మృతి, దేశ వ్యాప్తంగా 67,152కి చేరిన కరోనావైరస్ కేసుల సంఖ్య, యాక్టివ్‌గా 44,029 కేసులు, నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

వివిధ రాష్ట్రాల నుంచి 11 చెక్‌పోస్టుల ద్వారా ఏపీలోకి ప్రవేశించవచ్చని అధికారులు ఈ సంధర్భంగా ఏపీ సీఎంకు తెలిపారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత అనుమతించిన గమ్యానికి చేరుకునే వరకు యాప్‌ ద్వారా ట్రాక్‌ చేస్తామని వారు సీఎంకు వివరించారు. అనంతరం వారి వివరాలను గ్రామంలో వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, సచివాలయ హెల్త్‌ అసిస్టెంట్‌కు చేరవేయాలని వీరికి సీఎం సూచించారు.హోం క్వారంటైన్‌ పాటించేలా చేయడం, పరీక్షలు, వైద్య సదుపాయాలు, ఆస్పత్రికి తరలించడం లాంటి కార్యక్రమాలు కొనసాగేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2000కు చేరువైన కోవిడ్-19 బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో రాష్ట్రంలో 50 పాజిటివ్ కేసులు, మరో కరోనా మరణం నమోదు, వైరస్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష

లాక్‌డౌన్‌ అనంతరం రాష్ట్రంలోకి రాకపోకలు, కదలికలు ప్రారంభమయ్యాక ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అనుసరించాల్సిన హెల్త్‌ ప్రొటోకాల్‌పై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఒక వ్యక్తి ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి అడుగుపెట్టేటప్పుడు ఎలాంటి వైద్య పరీక్షలు చేయాలి? ఐసోలేషన్‌ విధానం ఎలా ఉండాలో ప్రొటోకాల్‌ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఒక్క ల్యాబ్‌తో ప్రారంభమైన కోవిడ్‌–19 నియంత్రణ చర్యల ప్రయాణం ఇవాళ దేశంలోనే అత్యధిక పరీక్షలు చేసే స్థాయికి చేరుకుందని, గట్టిగా పనిచేసి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలుగుతున్నామని ఈ సమావేశంలో అధికారులు పేర్కొన్నారు.