AP DGP Damodar Goutam Sawang: ఫేక్ వార్తలపై పోలీసుల డేగ కన్ను, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠినచర్యలు తప్పవు, సైబర్‌ క్రైం వింగ్‌లో సోషల్‌ మీడియా నేరాల నియంత్రణ, పర్యవేక్షణకు మరో వింగ్, మీడియాతో డీజీపీ గౌతం సవాంగ్

సమాచార, ప్రసార మధ్యమాల నియంత్రణ చట్టం పరిధిలో ఉండాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ (Damodar Goutam Sawang) అన్నారు. ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచురణలు, ప్రసారాలు చేసేవారు, అభిప్రాయాలు వ్యక్తీకరించేవారు నియంత్రణ పాటించకపోతే అట్టి వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

Andhra pradesh dgp-gautam-sawang-calls-people-support-janata-curfew (Photo-Facebook)

Amaravati, May 27: ఫేక్ వార్తలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ (AP DGP Damodar Goutam Sawang) కీలక వ్యాఖ్యలు చేశారు. సమాచార, ప్రసార మధ్యమాల నియంత్రణ చట్టం పరిధిలో ఉండాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ (Damodar Goutam Sawang) అన్నారు. ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచురణలు, ప్రసారాలు చేసేవారు, అభిప్రాయాలు వ్యక్తీకరించేవారు నియంత్రణ పాటించకపోతే అట్టి వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, విద్యా వ్యవస్థపై మూడో రోజు మన పాలన-మీ సూచన కార్యక్రమం, పలు విషయాలను ప్రసావించిన ఏపీ సీఎం

ఎలక్ట్రానిక్, ప్రింట్‌, సోషల్‌ మీడియాలు నియంత్రణ లేకుండా రెచ్చ గొట్టేలా వ్యవహరిస్తున్నాని తెలిపారు. ప్రచురిస్తున్న వార్తలు, వ్యాఖ్యానాలు వ్యక్తిగత దూషణల నుంచి మొదలై వైషమ్యాల వైపు దారి తీస్తూ, అశాంతి వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి పరిణామాలు సమాజానికీ, వ్యవస్థకూ మంచిది కాదన్నారు. వాటిని అరికట్టేందుకు శాఖాపరమైన వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని వివరించారు.

సీఐడీ విభాగంలోని సైబర్‌ క్రైం వింగ్‌లో సోషల్‌ మీడియా నేరాల నియంత్రణ, పర్యవేక్షణకు ప్రత్యేకంగా మరో వింగ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఫిర్యాదులపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని డీజీపీ చెప్పారు.మాధ్యమాల్లో రాజ్యాంగ బద్ద సంస్థల పట్ల, ఆ సంస్థల నిర్వహణలో ఉన్న వ్యక్తుల పట్ల వ్యాఖ్యలు చేయడం సరికాదని డీజీపీ గౌతం సవాంగ్‌ అన్నారు. ఇటీవల గౌరవ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పట్ల, వారి తీర్పుల పట్ల కొందరు చట్టాన్ని అతిక్రమించి వ్యాఖ్యలు చేశారన్న విషయంలో హైకోర్టు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు వేగవంతం చేశామని డీజీపీ తెలిపారు. చంద్రబాబుపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై విచారణ రేపటికి వాయిదా, ఆ 49 మందిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు పెట్టి, నోటీసులు జారీ చేయాలన్న ఏపీ హైకోర్టు

అలాగే ప్రభుత్వం మీద, ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తులమీద కూడా తప్పుడు ప్రచారాలు, అవాస్తవాలు ప్రచారంచేసి ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్ననిస్తున్నారని అన్నారు. వీటన్నింటిమీద పోలీసుల కన్ను ఉందని తెలిపారు. అవాస్తవాలు ప్రచారం చేసి ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్ననిస్తున్న వారి మీద పోలీసుల నిఘా ఉందని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.



సంబంధిత వార్తలు

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

BRS Leader Errolla Srinivas Arrest: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్..ఖండించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఇందిరమ్మ రాజ్యమా?..పోలీస్ రాజ్యామా? అని మండిపాటు

Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం