AP High Court: చంద్రబాబుపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై విచారణ రేపటికి వాయిదా, ఆ 49 మందిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు పెట్టి, నోటీసులు జారీ చేయాలన్న ఏపీ హైకోర్టు
AP Govt Offices Shifting Row Andhra Pradesh High Court adjourned Enquiry On Vigilance Commission | (Photo-Twitter)

Amaravati, May 27: ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు (Chandrababu) కరోనావైరస్ లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించటంపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) బుధవారం విచారణ జరిపింది. బాబు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించటంపై (Lockdown Violation) సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారా? లేదా? అని న్యాయస్థానం పిటిషనర్‌ను ప్రశ్నించింది.  ఏపీలో తాజాగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 1913 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్, 2787కి చేరిన మొత్తం కోవిడ్ 19 కేసుల సంఖ్య

గతంలో ఇలాంటి కేసును నేరుగా హైకోర్టు విచారణకు స్వీకరించిందని పిటిషనర్‌ హైకోర్టు దృష్టికి తీసుకురాగా.. ఐదుగురు ఎమ్మెల్యేల కేసుతోపాటు చంద్రబాబునాయుడు కేసును కూడా రేపు(గురువారం) విచారిస్తామని హైకోర్టు తెలిపింది.

కాగా, లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఏపీలో లాక్ డౌన్ 4 కొనసాగుతున్న వేళ రెండు నెలల తర్వాత సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టారు. రహదారి మార్గం గుండా చంద్రబాబు విజయవాడకు చేరుకోగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు. రైతులు, కూలీల్లో చిరునవ్వును చూడటమమే లక్ష్యం, రైతులకు మరిన్ని పథకాలు అందిస్తామని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్

ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. వైయస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, టీడీపీ మహానాడులో విమర్శలు ఎక్కుపెట్టిన చంద్రబాబు, టీడీపీ కార్యాలయానికి కోవిడ్ 19 నోటీసులు పంపించిన ఏపీ సర్కారు

న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 49 మందిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు పెట్టి, నోటీసులు జారీ చేసింది. బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో పాటు మొత్తం 49 మందిపై కోర్టు ధిక్కారణ కేసు నమోదు చేయడంతో పాటు వీరందరికీ నోటీసులు పంపించాలని రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 65 రోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన నారా చంద్రబాబునాయుడు, లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ ప్రతిపక్షనేత

మే 22 నుంచి 24 మధ్య హైకోర్టు రిజిస్ట్రార్‌కి మెయిల్స్, ఫోన్ ద్వారా కొన్ని వీడియోలు, పత్రికా క్లిప్పింగులూ వచ్చాయనీ, పలు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులకు స్పందనగా హైకోర్టుపైనా, హైకోర్టు జడ్జీలపైనా, సుప్రీం కోర్టు న్యాయమూర్తులపైనా కులం, అవినీతి, లేని ఉద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేశారనీ ఆ ఉత్తర్వుల్లో ఉంది. ఈ విషయంపై వారు స్పందించారు.  మన పాలన – మీ సూచనలో ఏపీ సీఎం వైయస్ జగన్, మే 30వ తేదీ వరకూ జరగనున్న కార్యక్రమం, ఈ ఏడాది పథకాల క్యాలండర్ ఇదే

నేనేమీ న్యాయమూర్తిపై వ్యక్తిగతంగా కామెంట్ చేయలేదు. అబ్యూజ్ చేయలేదు. అదే సమయంలో నా ప్రాథమిక హక్కు అయినటువంటి, నాకు నచ్చని ఒక విషయాన్ని నేను వ్యక్తీకరించాను. ప్రజల ముందు నేను ఏం చెప్పానో దానికి నేను వంద శాతం కట్టుబడి ఉన్నామని అన్నారు. ఒక సామాన్యుడిగా బాధలు చెప్పుకున్నామే తప్ప, కోర్టులను ధిక్కరించే ఉద్దేశం తమకు లేదని తెలిపారు. వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని ఏదో రోజు న్యాయం గెలుస్తుందని అన్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో ఐదుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు గతంలో ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారిలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, పలమనేరు ఎమ్మెల్యేవెంకట గౌడ.. నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట ఎమ్మెల్యే సంజీవయ్య.. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ఉన్నారు. లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు అతిక్రమించారని వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు. నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యల వివరాలు తెలుపుతూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును రేపు విచారిస్తామని తెలిపింది.