TDP Mahanadu: వైయస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, టీడీపీ మహానాడులో విమర్శలు ఎక్కుపెట్టిన చంద్రబాబు, టీడీపీ కార్యాలయానికి కోవిడ్ 19 నోటీసులు పంపించిన ఏపీ సర్కారు
TDP Mahanadu (Photo-TDP Twitter)

Vijayawada, May 27: తెలుగు దేశం పార్టీ (TDP) వార్షిక సమావేశం (TDP Mahanadu 2020) మహానాడు బుధవారం ఉదయం జరిగింది. దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్-ప్రేరేపిత లాక్‌డౌన్ అమలులో ఉన్నందున రెండు రోజుల పాటు జూమ్ యాప్ ద్వారా సమావేశం నిర్వహిస్తున్నారు. COVID-19 మహమ్మారి మధ్య అనుసరిస్తున్న సామాజిక దూర నిబంధనలను అనుసరించడానికి ఈ ఏడాది వార్షిక సమావేశాన్ని జూమ్ వీడియో కాన్ఫరెన్స్ యాప్ ద్వారా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టిడిపి (Telugu Desam Party) నిర్ణయించింది.  ఏపీలో తాజాగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 1913 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్, 2787కి చేరిన మొత్తం కోవిడ్ 19 కేసుల సంఖ్య

వర్చువల్ సమావేశంలో 14,000 మంది టిడిపి నాయకులు, కార్మికులు పాల్గొంటారని పార్టీ తెలిపింది. హాజరైన వారిలో ఎక్కువ మంది సమావేశాన్ని వింటారు మరియు కొద్దిమంది నాయకులు మాత్రమే సమావేశం సందర్భంగా మాట్లాడతారని కూడా తెలిపింది.

తొలిరోజు సమావేశంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకంటే ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ అధినేత చంద్రబాబు, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, చిన రాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులు, ఇటీవల చనిపోయిన పార్టీ కార్యకర్తలకు మహానాడు వేదిక ద్వారా తమ సంతాపం తెలియజేశారు.

Here's TDP Tweets

ఈ సందర్భంగా చంద్రబాబు (N Chandrababu Naidu) మాట్లాడుతూ.. విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన గురించి తెలిసినప్పుడు చాలా బాధపడ్డానని, కానీ లాక్‌ డౌన్ వల్ల అక్కడకు వెళ్లలేకపోయానని పేర్కొన్నారు. గ్యాస్ లీక్‌ దుర్ఘటన జరగ్గానే విశాఖ వెళ్లేందుకు కేంద్రాన్ని అనుమతి కోరానని అన్నారు. తాజాగా మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరానని.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రానందునే వెళ్లలేకపోయానని వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు స్టైరీన్ గ్యాస్ తీవ్రతపై శాస్త్రీయ పరిజ్ఞానం లేదని చంద్రబాబు అన్నారు. బాధితులకు అండగా నిలబడ్డ ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన రంగనాయకమ్మ, తదితరులపై కేసులు పెట్టడం అమానుషమని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Here's TDP Mahanadu live

జగన్‌ పాలనంతా భూకబ్జాలు, అవినీతిమయమని చంద్రబాబు విమర్శించారు. ఆరోగ్యసేతు యాప్ తయారు చేసే వ్యక్తికి చెందిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ పులివెందుల నుంచి వచ్చిన కొంతమంది దౌర్జన్యం చేశారన్నారు. అలాగే కాకినాడ మడ అడవులు, ఇంకొకవైపు ఆవ, రాజమండ్రి భూములు, గుడివాడలో ప్రైవేటు భూములు.. 63 మంది కొనుక్కుంటే అవి ఇచ్చేయాలని ఓ మంత్రి బలవంతం చేయడమంటే.. వాళ్లను ఏమనాలో అర్థం కావడం లేదని అన్నారు.

మొత్తంగా చంద్రబాబు తొలిరోజు మహానాడు సమావేశం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జరిగిందనే చెప్పాలి. జగన్ సర్కారు అన్ని చోట్లా విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. ఈ ప్రభుత్వం తప్పు చేయడం, కప్పి పుచ్చుకోడానికి ఎదురుదాడి చేస్తుందని విమర్శించారు. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్లో నారా లోకేష్ అట్రాక్షన్ గా మారారు. బరువు తగ్గి చాలా స్లిమ్ అయ్యారంటూ పలువురు ఆ రహస్యం మాకు చెప్పాలని అడగటం కనిపించింది.

ఇదిలా ఉంటే మహానాడు జరుగుతున్న సమయంలోనే అమరావతిలో ఉన్న టీడీపీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. పార్టీ ఆఫీస్‌కు అధికారులు కోవిడ్ నోటీసులు పంపారు.. మహానాడు సందర్భంగా కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళగిరి ఎమ్మార్వో.. పార్టీ కార్యాలయం కార్యదర్శి రమణకు ఆత్మకూరు వీఆర్వో ద్వారా నోటీసులు అందజేశారు.