Amaravati, May 25: ఏపీ ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu), ఆయన కుమారుడు లోకేష్ ఎట్టకేలకు అమరావతికి (Amaravati) చేరుకున్నారు. సుమారు 65 రోజుల తర్వాత వీరిద్దరూ ఎపిలో కాలుపెట్టారు. అంతకుముందు వీరిద్దరూ హైదరాబాద్ వెళ్లగా కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ (Lockdown) ప్రకటించారు. రికవరీ రేటులో ఏపీ టాప్, మొత్తంగా 1848 మంది కోలుకుని డిశ్చార్జి, 767 యాక్టివ్ కేసులు, ఏపీలో 2671కి చేరిన కోవిడ్ 19 కేసులు
దీంతో వీరు అక్కడే చిక్కుకొని పోయారు. లాక్‌డౌన్ నాలుగో దశలో (Lockdwon 4) వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుని పోయిన ప్రజలు సొంతూళ్లు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. దీంతో చంద్రబాబు, లోకేష్ కూడా హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్నారు.
ముందు షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు హైదరాబాద్ నుండి నేరుగా విశాఖకు విమానంలో వెళ్లి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ బాధితులను పరామర్శించాల్సి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మంగళవారం నుంచి విమానాల రాకపోకలను ప్రారంభించనుంది. పది రాష్ట్రాలే కొంప ముంచాయి, 90 శాతం కేసులు ఆ రాష్ట్రాల్లోనే, దేశంలో లక్షా 38 వేలు దాటిన కోవిడ్ 19 కేసులు, 4,021 మంది మృతి
దీంతో చంద్రబాబు రోడ్డు మార్గంలో అమరావతి చేరుకున్నారు.దీంతో రోడ్డు మార్గాన హైదరాబాద్ నుండి తాడేపల్లిలో తన నివాసానికి చంద్రబాబు బయలుదేరారు. గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద చంద్రబాబు కాన్వాయ్ వాహనాల వరకు అనుమతించిన పోలీసులు...అదనంగా ఉన్న కార్లను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఆయన ఈరోజు కాని, రేపు కాని విశాఖపట్నం వెళ్లే అవకాశముంది. అక్కడ ఎల్జీ పాలిమర్స్ బాధితులను చంద్రబాబు పరామర్శించనున్నారు.
Here's Video
Chandrababu naidu while going on national highway number 9 from Hyderabad to Vijayawada
People need to follow covid-19 rules @ncbn @naralokesh @JaiTDP pic.twitter.com/veSYqscVhI
— Lokesh journo (@Lokeshpaila) May 25, 2020
తాను విశాఖ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని.. చంద్రబాబు ఇటీవల డీజీపీకి లేఖ రాశారు. దీనిపై డీజీపీ నుంచి ఆయనకు అనుమతి లభించింది. ఇదిలా ఉంటే ఈ నెల 27, 28వ తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాల్లో ఆయన మంగళగిరి సమీపంలోని ఎన్టీఆర్ భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.