Coronavirus Cases in India (Photo Credits: PTI)

New Delhi, May 25: భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య (Coronavirus Cases in India) రోజురోజుకి పెరగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 6,977 కరోనా కేసులు నమోదు కాగా, 154 మంది మృతిచెందారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం కావడం గమనార్హం. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,845కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తెలంగాణలో 1854కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, 50 దాటిన కరోనా మరణాలు, గడిచిన 24 గంటల్లో కొత్తగా 41 పాజిటివ్ కేసులు నమోదు, కరోనా నేపథ్యంలో పాతబస్తీలో కళ తప్పిన రంజాన్ పర్వదినం

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 57,720 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,021 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 77,103 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనా (Coronavirus in India) ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య 50 వేలు దాటింది. అక్కడ ఇప్పటివరకు 50,231 కరోనా కేసులు నమోదు కాగా, 14,600 మంది కోలుకున్నారు. 1,635 మంది మృతిచెందారు. ఆ తర్వాత తమిళనాడులో 16,277, గుజరాత్‌లో 14,056, ఢిల్లీలో 13, 418 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదిలా ఉంటే భార‌త్‌లో స‌రైన స‌మ‌యంలో లాక్ డౌన్ అమ‌లు చేయ‌డంతో క‌రోనా వైర‌స్ వ్యాప్తిని స‌మ‌ర్థంగా క‌ట్ట‌డి చేయ‌గ‌లిగామ‌ని సెంట్ర‌ల్ క‌రోనా టాస్క్ ఫోర్స్ ఎంప‌వ‌ర్డ్ గ్రూప్ -1 చైర్మ‌న్ వీకే పాల్ అన్నారు. దేశంలో నెలకొన్నపరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్య ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌కు (Lockdown) ముందు, లాక్‌డౌన్‌ (Lockdown 4) అనంతర పరిస్థితుల మధ్య చాలా వ్యత్యాసం కనిపించిందని చెప్పారు. కాగా దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన 1,38,536 క‌రోనా కేసుల్లో ఎక్కువ భాగం కొన్ని రాష్ట్రాల్లోనే ఉన్నాయ‌ని, మరికొన్ని ప్రాంతాల్లో క‌రోనా తీవ్ర‌త చాలా త‌క్కువ‌గానే ఉంద‌న్నారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఓ క్రూరమైన జోక్, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ

ప్ర‌స్తుతం దేశంలో మొత్తం 73,560 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. అందులో 70 శాతం కేవ‌లం ప‌ది సిటీల్లోనే ఉన్నాయ‌న్నారు. దేశంలోని 90 శాతం యాక్టివ్ కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయని, ఇక మిగిలిన 10 శాతం కేసులు దేశం మొత్తంగా ఉన్నాయ‌ని వీకే పాల్ పేర్కొన్నారు. దేశంలో ఉన్న మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల్లో 80 శాతం మ‌హారాష్ట్ర, గుజ‌రాత్, త‌మిళ‌నాడు, ఢిల్లీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ల‌లోనే ఉన్నాయ‌న్నారు. ఇక క‌రోనాతో సంభ‌వించిన మ‌ర‌ణాలు కూడా కొన్ని రాష్ట్రాలు, సిటీల్లోనే న‌మోదైన‌ట్లు వీకే పాల్ తెలిపారు