An empty street near Charminar, Hyderabad. | Photo Credits: ANI

Hyderabad, May 25: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 1854కు చేరింది. నిన్న నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 23 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోవే కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి మరొక పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో మరో 11 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు వలస వచ్చిన వారిలో 148 మందికి కరోనా సోకినట్లు నిర్ధారింపబడింది. అలాగే ఇతర దేశాల నుంచి స్వదేశానికి చేరుకుని ప్రస్తుతం క్వారైంటైన్లో ఉన్నవారిలో ఓ ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

మరోవైపు, రాష్ట్రంలో గత వారం రోజులుగా వరుసగా కోవిడ్ మరణాలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఆదివారం మరో 4 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 53కి పెరిగింది.

గత 24 గంటల్లో మరో 24 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1092 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 709 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Telangana's #COVID19  Report:

Status of positive cases of #COVID19 in Telangana

 

ఇక హైదరాబాద్ లోనే ఎక్కువగా కేసులు నమోదవుతుండటంతో కంటైన్మైంట్ జోన్ పరిధిలో ఉన్న పాతబస్తీలో కఠిన లాక్డౌన్ అమలవుతోంది. లాక్డౌన్ ప్రభావంతో ఈ ఏడాది రంజాన్ పర్వదినం కళ తప్పినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

Hyderabad Lockdown:

రంజాన్ వచ్చిందంటే చార్మినార్ వద్ద ఎక్కడలేని సందడి కనిపిస్తుంది. షాపింగ్స్ తో, హలీం ఘుమఘుమలతో ధూంధాంగా కనిపించేది. అయితే ఈ ఏడాది కరోనా లాక్డౌన్ కారణంగా చార్మినార్ పరిసరాలన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. పండగ కోసం తెచ్చిన స్టాక్ అంతా అలాగే మిగిలిపోయిందని. ఈ ఏడాది రంజాన్ సేల్ ఇప్పటివరకు కేవలం 20 శాతం మాత్రమే జరిగిందని అమ్మకందార్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.