AP COVID-19: రికవరీ రేటులో ఏపీ టాప్, మొత్తంగా 1848 మంది కోలుకుని డిశ్చార్జి, 767 యాక్టివ్ కేసులు, ఏపీలో 2671కి చేరిన కోవిడ్ 19 కేసులు
Coronavirus Outbreak in AP | PTI Photo

Amaravati, May 25: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 44 కరోనా పాజిటివ్‌ కేసులు (AP COVID-19) నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల (AP Coronavirus) సంఖ్య 2671కి చేరింది. ఈ వైరస్‌ ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 56 మంది మరణించారు. ఇప్పటివరకు ఈ వైరస్‌ బారిన పడినవారిలో 1848 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 767 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో 14 కేసులకు కోయంబేడు లింకులు ఉన్నాయి.

గత 24 గంటల్లో 10,240 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 44 మందికి కరోనా (Coronavirus) పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరులో 5, నెల్లూరులో 2 మొత్తంగా ఏడుగురు కోయంబేడు (తమిళనాడు) నుంచి వచ్చిన వలస కార్మికుల్లో నమోదయ్యాయి. ఈ రోజు ఒక్కరోజే 41 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారని, ఎటువంటి మరణాలు నమోదు కాలేదని పేర్కొంది.  తెలంగాణలో 1854కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, 50 దాటిన కరోనా మరణాలు, గడిచిన 24 గంటల్లో కొత్తగా 41 పాజిటివ్ కేసులు నమోదు, కరోనా నేపథ్యంలో పాతబస్తీలో కళ తప్పిన రంజాన్ పర్వదినం

ఇదిలా ఉంటే రికవరీ రేటు విషయంలో 65.82 శాతంతో ఏపీ మొదటిస్థానంలో నిలిచింది. రికవరీ రేటు విషయంలో ఏ రాష్ట్రమూ ఏపీ దరిదాపుల్లోనే లేవు. 56.61 శాతం రికవరీ రేటుతో ఉత్తరప్రదేశ్‌ రెండోస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర (28.40 శాతం), బిహార్‌ (26.27 శాతం), కర్ణాటక (31.04 శాతం)లు అత్యంత వెనుకబడి ఉన్నాయి. దేశీయ సగటు రికవరీ రేటు 41.28 శాతంగా ఉంది. 3.5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో రికవరీ రేటు 58.91 శాతంగా ఉంది. పది రాష్ట్రాలే కొంప ముంచాయి, 90 శాతం కేసులు ఆ రాష్ట్రాల్లోనే, దేశంలో లక్షా 38 వేలు దాటిన కోవిడ్ 19 కేసులు, 4,021 మంది మృతి

దేశంలో 5 కోట్ల జనాభా దాటిన రాష్ట్రాల్లో గుజరాత్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫెక్షన్‌ రేటు 0.92 శాతంగా ఉంది. 1.01 శాతం ఇన్ఫెక్షన్‌ రేటుతో కర్ణాటక రెండోస్థానంలో ఉంది. దేశ సగటు ఇన్ఫెక్షన్‌ రేటు 4.48 శాతంగా ఉండడం గమనార్హం. అత్యధికంగా ఇన్ఫెక్షన్‌ రేటు సోకిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర (13.64 శాతం), గుజరాత్‌ (7.68 శాతం)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.