AP DGP Reacted to Babu Letter: నిజాలు తెలుసుకుని ఆరోపణలు చేయండి, చంద్రబాబుకు ప్రత్యుత్తరం ఇచ్చిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, చిత్తూరు జడ్డి సోదరుడుపై దాడి ఘటనపై బాబు లేఖ
ఈ మేరకు చంద్రబాబుకు డీజీపీ గౌతం సవాంగ్ రిప్లయి (AP DGP Reacted to Babu Letter) ఇచ్చారు. చట్టప్రకారం తాము విధులు నిర్వర్తిస్తామని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీలాంటి వ్యక్తులు మీడియాకు లేఖలు ఇచ్చే ముందు వాస్తవాలను పరిశీలించాలని ఏపీ డీజీపీ (DGP Gautam Sawang) కోరారు. జడ్జి రామక్రిష్ణ సోదరుడు రామచంద్రపై దాడి ఘటనలో వాస్తవాలను వివరిస్తూ ఈ మేరకు డీజీపీ, బాబుకు లేఖ (AP DGP Reacted to Babu Letter) రాశారు.
Amaravati, Sep 29: ఏపీలో చిత్తూరు జిల్లాలో జడ్జి రామక్రిష్ణ సోదరుడు రామచంద్రపై దాడి ఘటనలో వాస్తవాలు తెలుసుకోవాలని చంద్రబాబుకు ఏపీ డీజీపీ సూచించారు. ఈ మేరకు చంద్రబాబుకు డీజీపీ గౌతం సవాంగ్ రిప్లయి (AP DGP Reacted to Babu Letter) ఇచ్చారు. చట్టప్రకారం తాము విధులు నిర్వర్తిస్తామని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీలాంటి వ్యక్తులు మీడియాకు లేఖలు ఇచ్చే ముందు వాస్తవాలను పరిశీలించాలని ఏపీ డీజీపీ (DGP Gautam Sawang) కోరారు. జడ్జి రామక్రిష్ణ సోదరుడు రామచంద్రపై దాడి ఘటనలో వాస్తవాలను వివరిస్తూ ఈ మేరకు డీజీపీ, బాబుకు లేఖ (AP DGP Reacted to Babu Letter) రాశారు. దాడికి పాల్పడ్డ ప్రతాప్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని విచారణలో తేలిందన్నారు. చంద్రబాబు (Nara Chandrababu Naidu) ఆరోపించినట్లుగా ఈ ఘటనతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని, మదనపల్లె డిఎస్పీ దర్యాప్తు వేగవంతం చేశారని డీజీపీ పేర్కొన్నారు.
గొడవకు దారి తీసిన పరిస్థితులు, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి లేఖలో వివరించారు. ‘‘సెప్టెంబరు 27న 4.30 గంటలకు ఈ ఘటన జరిగింది. కారులో వెళ్తున్న ప్రతాప్ రెడ్డికి, తోపుడు బండి వ్యక్తికి వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న రామచంద్ర ఆ వివాదంలో కలుగజేసుకుని గొడవపడ్డారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి, రామచంద్రల మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే స్థానికులు కలుగజేసుకుని ఇద్దరినీ వేరు చేశారు. ప్రతాప్‌రెడ్డితో జరిగిన గొడవలో రామచంద్రకు గాయాలయ్యాయి. వెంటనే రామచంద్రను కొత్తకోటకు వైద్యం కోసం తరలించారు. రామచంద్ర మద్యం మత్తులో ఉన్నారని మెడికల్ ఆఫీసర్ నివేదిక ఇచ్చారు.
మెరుగైన చికిత్స కోసం రామచంద్రను మదనపల్లి ఆస్పత్రికి తరలించాం. వెంటనే ఈ ఘటనపై రామచంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. సాక్షుల వాంగ్మూలం ,సీసీ కెమెరా ఫుట్ఠేజ్ ల ఆధారంగా, రామచంద్రపై దాడిచేసిన ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేసి కోర్టు ముందుంచాం. నిందితుడు ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. మీరు రాసిన లేఖలో వైఎస్సార్ సీపీ నేతలు దాడిచేశారని ఆరోపించారు. కానీ ఆ ఆరోపణలు వాస్తవం కాదని విచారణలో తేలింది. నిజాలు తెలుసుకోకుండా మీలాంటి వాళ్లు ఇలా ఆరోపణలు చేయడం తగదు. మీ సంతకం తో మీడియాకు లేఖలు ఇచ్చే ముందు వాస్తవాలను పరిశీలించాలి. మీ దగ్గర ఏమైనా ఆధారాలుంటే ముందు నా దృష్టికి తీసుకురావాలి’’ అని డీజీపీ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.