Rain Alert For AP: వాతావ‌ర‌ణ శాఖ చెప్పిన న్యూస్ తో అభ్య‌ర్ధుల గుండెల్లో ద‌డ‌, రాష్ట్రవ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో ఇప్ప‌టికే మొద‌లైన వాన‌లు

ప్రత్యర్థుల చేతిలో కంటే వరుణుడి(Rains) చేతిలో ఓటమి పాలవుతామన్న బెంగ వారిలో కనబడుతుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Meteorological department ) హెచ్చరించడం అభ్యర్థుల ఆందోళనకు కారణమవుతుంది.

rains

Vijayawada, May 12: ఏపీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీ పడుతున్న అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రత్యర్థుల చేతిలో కంటే వరుణుడి(Rains) చేతిలో ఓటమి పాలవుతామన్న బెంగ వారిలో కనబడుతుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Meteorological department ) హెచ్చరించడం అభ్యర్థుల ఆందోళనకు కారణమవుతుంది. గెలుపు కోసం రెండు నెలల పాటు రాత్రింబవళ్లు కష్టపడ్డ అభ్యర్థులు పోలింగ్‌ మరి కొద్ది గంటల్లో ప్రారంభం అవుతున్న సమయానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో పోలింగ్‌ శాతం తగ్గిపోయి గెలుపోటములపై ప్రభావం చూపుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. ఆదివారం కడప (Kadapa) జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నియోజకవర్గమైన పులివెందులలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

Rain Alert to AP: కొనసాగుతున్న ఉపరితల ద్రోణి.. ఏపీలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం.. రేపు అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. 

ఎన్నికల డిస్ట్రిబూషన్‌ కేంద్రం వద్ద పోలింగ్‌ సిబ్బంది వర్షంతో ఇబ్బందులు పడ్డారు. వర్షానికి టెంట్లు నేలకూలగా, కుర్చీలు కొంత దూరంలో ఎగిరిపడ్డాయి . మరోవైపు సోమవారం ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన వర్షం పడే సూచనలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది.



సంబంధిత వార్తలు

Newborn Baby Flushed Down Toilet: ఇంత కిరాత‌క‌మా! అప్పుడే పుట్టిన శిశువును టాయిలెట్ వేసి ఫ్ల‌ష్ కొట్టారు, బాత్రూం పైప్ బ్లాక్ అవ్వ‌డంతో వెలుగులోకి నిజం

Cyclone Fengal Alert: మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, దూసుకువస్తున్న ఫెంగల్ తుఫాన్, ఏపీలో మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడు తీర ప్రాంతాలకు పెను ముప్పు

Cyclone Fengal: నెల్లూరు, తిరుపతి జిల్లాలను వణికిస్తున్న ఫెంగల్ తుఫాను, సముద్రంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Chennai School Holiday: చెన్నై వైపు దిశను మార్చుకున్న ఫెంగల్‌ తుఫాను, స్కూళ్లు, కాలేజీలు మూసివేత, సముద్రంలో 5 అడుగుల మేర ఎగసిపడుతున్న అలలు