
Vijayawada, May 12: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో (AP) నేడు పిడుగులతో కూడిన వర్షాలు (Rains) పడే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఏపీలో రేపు కూడా వర్షాలు పడతాయని తెలిపింది. కాకినాడ, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, విజయనగరం, కృష్ణా, పార్వతీపురం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, విశాఖ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కొన్నిచోట్ల పిడుగులు కూడా పడే అవకాశముందని తెలిపింది.
