
Vijayawada, Nov 24: ఆగ్నేయ బంగాళాఖాతంలో (Bay of Bengal) శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ రేపటికల్లా (సోమవారం) దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడనుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. అల్పపీడనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని (Rains), ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొన్నారు. అల్పపీడనం బలపడి తమిళనాడు తీరం దిశగా రానున్నందున ఈనెల 27 నుంచి కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా వాయుగుండం తీరం దిశగా వచ్చే సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరి కోతలు కోసే రైతులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
27న ఇక్కడ వర్షాలు
నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి.
28న ఇక్కడ వర్షాలు
అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి.
29న ఇక్కడ వర్షాలు
అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది.
వాహనాలకు నంబరు ప్లేట్లు లేకపోతే కఠిన చర్యలు: ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్