COVID in AP: ఏపీలో గత 24 గంటల్లో 1831 మందికి కరోనా, సంక్రాంతి పండుగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ అమలులో మార్పులు, ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయం
నేడు కరోనా వల్ల రాష్ట్రంలో ఎలాంటి మరణం సంభవించలేదు. గడిచిన 24 గంటల్లో 242 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 3,16,66, 683 శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది
Amaravati, Jan 11: ఏపీలో గత 24 గంటల్లో 36,452 శాంపిల్స్ పరీక్షించగా 1831 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ (state reports 1831 New Covid cases) అయింది. నేడు కరోనా వల్ల రాష్ట్రంలో ఎలాంటి మరణం సంభవించలేదు. గడిచిన 24 గంటల్లో 242 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 3,16,66, 683 శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 20,81,779 పాజిటివ్ కేసు లకు గాను 20,60,079 మంది డిశ్చార్జ్ కాగా 14,505 మంది మరణించారు. * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,195గా ఉంది.
ఇక సంక్రాంతి పండుగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఏపీ ప్రభుత్వం మార్పు (AP government postpones night curfew implementation) చేసింది. సంక్రాంతి తర్వాత నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కర్ఫ్యూపై ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం సవరణ చేసింది. పండగ సమయంలో పట్టణాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పల్లెలకు తరలివస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో కర్ఫ్యూ అమలును వాయిదా వేసినట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
థర్డ్ వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మంత్రి ఆళ్ల నాని కోరారు.