IPL Auction 2025 Live

Michaung Cyclone Input Subsidy: ఏపీ రైతుల‌కు గుడ్ న్యూస్, ఇన్ పుట్ స‌బ్సిడీ విడుద‌ల చేయ‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, తుఫాన్ తో న‌ష్ట‌పోయిన రైతుల ఖాతాల్లోకి రూ. 1294 కోట్లు రిలీజ్

సీఎం జగన్ (CM YS Jagan) ఇవాళ రైతుల ఖాతాల్లో ఇన్ ఫుట్ సబ్సిడీని జమ చేయనున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా (YSR Raithu Bhrosa), పీఎం కిసాన్ పథకం కింద పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని (Input subsidy) పంపిణీ చేయనున్నారు.

YS Jagan Mohan Reddy (Photo-YSRCP)

Vijayawada, March 06: వైసీపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం జగన్ (CM YS Jagan) ఇవాళ రైతుల ఖాతాల్లో ఇన్ ఫుట్ సబ్సిడీని జమ చేయనున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా (YSR Raithu Bhrosa), పీఎం కిసాన్ పథకం కింద పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని (Input subsidy) పంపిణీ చేయనున్నారు. ఈ మొత్తాన్ని ఆయన బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. గత ఏడాది ఖరీఫ్ లో ఏర్పడిన కరువు, మిచాంగ్ తుఫాన్ (Michaung Cyclone) వల్ల నష్టపోయిన 11లక్షల 59వేల మంది రైతులకు 1294 కోట్లకుపైగా నగదును పంపిణీ చేయనున్నారు. గతేడాది వర్షాభావంతో కరువు పరిస్థితులు ఏర్పడి లక్షలాది మంది రైతులు నష్టపోయారు. అదే సమయంలో మిచాంగ్ తుఫాన్ తో అకాల వర్షాలు కురిసి వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

Andhra Pradesh Elections 2024: తాజా సర్వే.. ఏపీలో మళ్ళీ వైసీపీదే అధికారం, అయితే ఎంపీ సీట్లు తగ్గే అవకాశముందని తెలిపిన ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే 

ఈ నేపథ్యంలో కరువు, తుపాన్ నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని జగన్ ఇవాళ అందజేయనున్నారు. ఏపీలో 103 మండలాలు కరువు మండలాలుగా కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రటకించింది. గత డిసెంబర్ మిచాంగ్ తుఫాన్ తో 22 జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసి 6లక్షల65వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేశారు. తుఫాన్ కారణంగా 4లక్షల 61వేల మంది రైతులు నష్టపోయారని ప్రభుత్వం లెక్క తేల్చింది.