AP Navaratnalu Calendar 2021: నవరత్నాలు 2021 క్యాలండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, నెలలవారీగా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి వార్షిక క్యాలెండర్, ఏ పథకం డబ్బులు ఎప్పుడు పడతాయో ఓ సారి చెక్ చేసుకోండి
సంక్షేమ పథకాలను (Welfare Schemes) ఒక క్రమపద్థతిలో నిర్మాణాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి అనుగుణంగా 2021–22 సంవత్సరానికి సంబంధించి నెలలవారీగా వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ కార్యదర్శి (ఎక్స్ అఫిషియో) జి.విజయ్‌కుమార్ తెలిపారు.
Amaravati, April 13: దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరకే చేరవేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నెలలవారీగా అమలుకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన క్యాలండర్‌పై (AP Welfare Schemes Calendar 2021) ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ రాష్ట్రంలో అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా నవరత్నాల (Navaratnalu Calendar Release) ద్వారా మహిళలతో సహా పేదలు, అట్టడుగు, బలహీన వర్గాల కోసం పలు సంక్షేమ పథకాలను (Welfare Schemes Calendar) అమలు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ కార్యదర్శి (ఎక్స్ అఫిషియో) జి.విజయ్‌కుమార్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలను (Welfare Schemes) ఒక క్రమపద్థతిలో నిర్మాణాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి అనుగుణంగా 2021–22 సంవత్సరానికి సంబంధించి నెలలవారీగా వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా, వైఎస్సార్ పెన్షన్ కానుక తదితర పథకాలతోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి క్యాలండర్ రూపొందించారు.
ప్రభుత్వం విడుదల చేసిన క్యాలండర్ ప్రకారం..
ఏప్రిల్ నెలలో
జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన మొదటి విడత
రైతులకు వైయస్సార్ సున్నా వడ్డీ రబీ 2021,
డ్వాక్రా మహిళలకు వైయస్సార్ సున్నా వడ్డీ రుణాలు
మే నెలలో
వైయస్సార్ ఉచిత పంటల బీమా 2020 ఖరీప్,
వైయస్సార్ రైతు భరోసా మొదటి విడత,
మత్స్యకార భరోసా (చేపల వేట నిషేధం),
మత్స్యకార భరోసా (డీజిల్ సబ్సిడీ)
జూన్ నెలలో
జగనన్న విద్యాకానుక
వైయస్సార్ చేయూత
జూలై నెలలో
జగనన్న విద్యా దీవెన రెండవ విడత
వైయస్సార్ వాహన మిత్ర
వైయస్సార్ కాపు నేస్తం
ఆగస్టు నెలలో
రైతులకు వైయస్సార్ సున్నా వడ్డీ ఖరీప్ 2020,
ఎంఎస్ఎంఈ స్పిన్నింగ్ మిల్లులకు ప్రోత్సాహకాలు
వైయస్సార్ నేతన్న నేస్తం
అగ్రి గోల్డ్ బాధితుల చెల్లింపులు
సెప్టెంబర్ నెలలో
వైయస్సార్ ఆసరా
అక్టోబర్ నెలలో
రైతు భరోసా రెండవ విడత
జగనన్న చేదోడు (దర్జీలు, నాయి బ్రాహ్మణులు, రజకులు)
జగనన్న తోడు (చిరు వ్యాపారులు)
నవంబర్ నెలలో
వైయస్సార్ ఈబీసీ నేస్తం
డిసెంబర్ నెలలో
జగనన్న వసతి దీవెన రెండవ విడత
జగనన్న విద్యా దీవెన మూడో విడత
వైయస్సార్ లా నేస్తం
జనవరి నెలలో
రైతు భరోసా మూడవ విడత
జగనన్న అమ్మఒడి
పెన్సన్ రూ. 2500కు పెంపు
ఫిబ్రవరి
జగనన్న విద్యా దీవెన నాలుగో విడత