Amaravati, April 13: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు (Ugadi Celebrations) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అర్చకులను సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) సన్మానించారు. కాగా కప్పగంతుల సుబ్బరామ సోమయాజుల శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. సంక్షేమం దిశగా సీఎం జగన్ పాలన ఉంటుందని శాస్త్రి తెలిపారు.
విద్యా విధానాల్లో కొత్త మార్పులు వస్తాయన్నారు. కొత్త ఏడాదిలో సంక్షేమ పథకాలను సీఎం జగన్ సమర్ధవంతంగా అమలు చేస్తారని అన్నారు. ఈ ఏడాది ఎన్నో విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు. ప్లవనామ సంవత్సరంలో కూడా వరుణుడి అనుగ్రహం ఉంటుందని.. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. పాడిపరిశ్రమ చక్కని ఫలితాలు అందుకుంటుందన్నారు. ఈ ఏడాది రైతులకు లాభదాయకంగా ఉంటుందని శాస్త్రి తెలిపారు.
Here's AP CM YS Jagan Ugadi Wishes
ప్రపంచ వ్యాప్తంగా ఉన్నతెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే ప్లవ నామ సంవత్సరంలో ప్రతి ఇల్లూ సుఖ సంతోషాలతో కళకళలాడాలని, ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలని, కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా.#HappyUgadi
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 13, 2021
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు (CM YS Jagan Ugadi Wihses) తెలిపారు. ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది కూడా వానలు కురిసి పంటలు బాగా పండాలని, కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు.