AP Employees Call Off Stir: అలా అన్నందుకు సీఎం జగన్ కు సారీ! సమ్మె ఆలోచన విరమించుకున్న ఏపీ ఉద్యోగులు, అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిన ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె (AP Employees Call Off Stir) ఆలోచనను విరమించుకున్నారు. మంత్రుల కమిటీతో (Ministers Committee) ఏపీ ఉద్యోగుల చర్చలు విజయవంతమయ్యాయి. మంత్రుల కమిటీతో రెండు రోజుల నుంచి సుధీర్ఘంగా సాగిన చర్చలు విజయవంతంగా ముగిసినట్లు ప్రకటించారు పీఆర్సీ సాధన సమితి (PRC JAC)నేతలు. మంత్రుల కమిటీతో అనేక డిమాండ్ల గురించి చర్చించామన్నారు.

Vijayawada, Feb 05: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె (AP Employees Call Off Stir) ఆలోచనను విరమించుకున్నారు. మంత్రుల కమిటీతో (Ministers Committee) ఏపీ ఉద్యోగుల చర్చలు విజయవంతమయ్యాయి. మంత్రుల కమిటీతో రెండు రోజుల నుంచి సుధీర్ఘంగా సాగిన చర్చలు విజయవంతంగా ముగిసినట్లు ప్రకటించారు పీఆర్సీ సాధన సమితి (PRC JAC)నేతలు. మంత్రుల కమిటీతో అనేక డిమాండ్ల గురించి చర్చించామన్నారు. ఉద్యోగులు అడగకుండానే సీఎం జగన్ (CM Jagan) అనేక ప్రయోజననాలు కల్పించారని, ఉద్యమం సమయంలో తాము చేసిన చిన్న చిన్న వ్యాఖ్యలను పట్టించుకోవద్దని నేతలు కోరారు. ఐదు డీఏలు (DA) ఒకేసారి ఇచ్చి తమకు మేలు చేశారని చెప్పారు. తమ డిమాండ్లు నెరవేర్చినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో సమ్మె చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు చెప్పారు.

Andhra Pradesh: ఉద్యమ బాట పట్టిన ఏపీ ఉద్యోగులు, పీఆర్సీ అమలు సహా 71 డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని వెల్లడి, నిరసనలకు దూరంగా ఉంటామని తెలిపిన ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ ఫోరం, ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్

మంత్రుల కమిటీ సమావేశంలో వేతన సవరణ విధానం మార్చాతామన్నారు. 17 అంశాలపై సానుకూల ఒప్పందం కుదిరిందని పీఆర్సీ (PRC) సాధన సమితి నేతలు తెలిపారు. సచివాలయంలో పని చేసే ఉద్యోగులందరికీ 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇచ్చేందుకు ఒప్పుకోవడం, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ తర్వాత కొత్త పీఆర్సీ అమలు చేస్తామని చెప్పడం పట్ల కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచాలని కోరామని, దీనిపై ప్రభుత్వం త్వరగా సానుకూంగా స్పందన వచ్చిందన్నారు. దీంతో సమ్మె చేయాల్సిన అవసరం లేదన్నారు. శనివారం నాడు దాదాపు7 గంటల పాటు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Special Package For Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు గుడ్‌న్యూస్‌, ఏకంగా రూ. 11,500 కోట్ల స్పెషల్ ప్యాకేజీ ఇచ్చేందుకు కసరత్తు, కేంద్ర కేబినెట్‌ భేటీలో చర్చ

Sukumar Wife Thabitha Cried On Stage: సినిమా కోసం గుండు కొట్టించుకున్న సుకుమార్ కుమార్తె, ఆ ఘటన తలచకుంటూ ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టిన భార్య

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

Amit Shah AP Tour Details: ఆంధ్రప్రదేశ్‌కు హోంమంత్రి అమిత్ షా.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్బీడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న షా, చంద్రబాబు నివాసంలో అమిత్‌ షాకు విందు

Share Now