Andhra Pradesh: సీఎం జగన్ మరో గుడ్ న్యూస్, కొత్తగా మరో 3 లక్షల 98 మందికి ఫించన్లు, లబ్ధిదారులందరికీ జూలై 19న పింఛను మంజూరు పత్రంతో పాటు ఫించను కార్డు

రాష్ట్రంలో కొత్తగా మరో 3 లక్షల 98 మందికి సామాజిక పింఛన్లు (A.P. Govt Ready to disburse pensions) ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గత ఏడాది డిసెంబర్‌లోనూ ప్రభుత్వం 1.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన సంగతి విదితమే.

Andhra pradesh : Pensions distributed to beneficiaries at doorstep (photo-Facebook)

Amaravati, June 28: ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో 3 లక్షల 98 మందికి సామాజిక పింఛన్లు (A.P. Govt Ready to disburse pensions) ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గత ఏడాది డిసెంబర్‌లోనూ ప్రభుత్వం 1.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన సంగతి విదితమే. తర్వాత డిసెంబర్‌ 1 నుంచి ఈ ఏడాది జూన్‌ 15వ తేదీ మధ్య పింఛన్ల కోసం అందిన దరఖాస్తులపై ఈ నెల 15–23 తేదీల మధ్య రెండు విడతలుగా పరిశీలన చేసి దాదాపు 3 లక్షల మందిని అర్హులుగా తేల్చారు.

కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులందరికీ (another 3 lakh 98 people newly in the state) జూలై 19న పింఛను మంజూరు పత్రంతోపాటు పింఛన్‌ కార్డు, పాస్‌బుక్‌లను అందజేయనున్నట్టు సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ అహ్మద్‌ తెలిపారు. నవరత్న కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి వివిధ కారణాలతో కొందరు అనర్హులుగా గుర్తించబడ్డారు.

గుడివాడలో కొడాలి నానిని ఓడించే దమ్ముందా.. చంద్రబాబుకు నిద్ర కూడా రావడం లేదు, వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో టీడీపీపై విరుచుకుపడిన వైసీపీ నేతలు

అయితే తదుపరి పరిశీలనలో వీరిలో అర్హులుగా గుర్తించిన వారికి జూలై 19న ప్రత్యేకంగా ఆయా పథకాల లబ్ధిని అర్హులకు అందజేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 24న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి కూడా అదే రోజున మంజూరు పత్రాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ వివరించారు. జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వం ఇప్పటిదాకా దాదాపు 20 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసిందని అధికారులు వెల్లడించారు.