Nara Lokesh Slams YCP: ఆత్మహత్యలను ఎగతాళి చేస్తారా, ఇదొక ఆబోతు ప్రభుత్వమంటున్న నారా లోకేష్, ఇసుకను పందికొక్కుల్లా తింటున్నారంటూ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు

ఇసుక కొరతను పట్టించుకోని, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను ఎగతాళి చేసేలా జగన్‌ ప్రభుత్వం (Jagan Mohan Reddy government) వ్యవహరిస్తోందని లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఇదో ఆబోతు ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు.

AP govt-to-blame-for-sand-crisi Nara lokesh (Photo-Facebook))

Kurnool, November 12: ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీడీపీ యువనేత,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( TDP general secretary Nara Lokesh) అధికార పార్టీ వైసీపీ (YSR Congress Party)పై తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక కొరతను పట్టించుకోని, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను ఎగతాళి చేసేలా జగన్‌ ప్రభుత్వం (Jagan Mohan Reddy government) వ్యవహరిస్తోందని లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఇదో ఆబోతు ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు.

కర్నూలుజిల్లా పత్తికొండలో సోమవారం ఆయన పర్యటించారు. ఇసుక కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు నాగరాజు, సుంకన్న కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. వారి పిల్లల భవిష్యత్‌కు టీడీపీ అండగా ఉంటుందని హామీఇచ్చారు.

నారా లోకేష్ పరామర్శ

అక్కడ టీడీపీ కార్యాలయంలో లోకేష్ మాట్లాడుతూ తమిళనాడు( Tamil Nadu), మహారాష్ట్ర(Maharashtra)ల్లోనూ భారీ వరదలు వచ్చాయని, కానీ అక్కడ ఇసుక కొరత (sand shortage) లేదని చెప్పారు. ఇక్కడ 5 నెలలుగా పనులు దొరక్క, అప్పులతో కడుపు నింపుకొంటున్న భవన నిర్మాణ కార్మికులు చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇసుక కొరతపై నారా లోకేష్ ధర్నా

ఇంట్లో పిల్లాడి సైకిల్‌ను అమ్ముకుని నిత్యావసరాలు కొనుక్కునే దుస్థితికి వారు చేరుకున్నారని వాపోయారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఇసుక తినేస్తున్నారంటూ తమపై ఆరోపణలు చేసిందని ఇప్పుడు పందికొక్కుల్లా పడి తింటున్నదెవరో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

2014లో శాసనసభ వేదికగా అమరావతి నిర్మాణంపై తీర్మానం జరిగిందని, అందరి ఆమోదంతోనే నిర్మాణం ప్రారంభమైందని లోకేశ్‌ చెప్పారు. అన్ని జిల్లాలనూ అభివృద్ధి చేయాలనే కాంక్షలో భాగంగా కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్‌, ఎయిర్‌పోర్టు, పరిశ్రమల స్థాపన తదితరాలకు టీడీపీ శ్రీకారం చుట్టిందన్నారు.

‘అమరావతి విషయంలో వైసీపీ మంత్రులు రోజుకో మాట మాట్లాడుతూ రాజధానిపై గందరగోళం సృష్టిస్తున్నారు. దీనివ్లల తెలంగాణలో భూమి ధరలు పెరిగాయి. ఇవన్నీ ప్రశ్నిస్తున్న మీడియాపై కేసులు పెడతామని ఉత్తర్వులు జారీ చేయడం అనాగరికమని అన్నారు.

మేం అధికారంలో ఉండగా తెలుగు సబ్జెక్టును ఆప్షనల్‌గా ఉంచుతూ ఇంగ్లిష్‌ మీడియం(English medium)ను ప్రవేశపెట్టాం. ఇప్పుడు తెలుగు మీడియంను పూర్తిగా తొలగిస్తూ.. అడిగిన వాళ్లపై ఎదురు దాడికి దిగుతున్నారు’ అని ధ్వజమెత్తారు. మద్య నిషేధం అని చెప్పిన జగన్‌ ప్రభుత్వం బాటిల్‌కు రూ.20 అధికంగా వసూళ్లు చేస్తూ రాష్ట్రంలో ‘జె’ ట్యాక్స్‌కు తెరదీసిందన్నారు.

దోమలపై దండయాత్రను ఎగతాళిచేసిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తన నియోజకవర్గంలో ఎంతమంది చిన్నారులు విషజ్వరాలతో చనిపోయారో తెలుసుకోవాలన్నారు. డెంగ్యూ, మలేరియాతో రాష్ట్రంలో ఇప్పటికే 2,500 మంది చనిపోయారని చెప్పారు.



సంబంధిత వార్తలు

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం

CM Revanth Reddy: రూ.192 కోట్లతో మెదక్‌ జిల్లాలో అభివృద్ధి పనులు, ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పలు శంకుస్థాపనలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ